Dragon Day 15 Collections : ‘డ్రాగన్’ 15వ రోజు కలెక్షన్లు.. రోజుకు ప్రదీప్ రంగనాథన్ కు ఎన్ని కోట్లంటే?
తమిళ హీరో, యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రదీప్ రంగనాథన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్నాడు. తన లేటెస్ట్ ఫిల్మ్ 'డ్రాగన్'తో గళ్లాపెట్టే నింపేస్తున్నాడు. చిన్న బడ్జెట్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి సెన్సేషన్ గా మారాడు. మొదటి వారం రూ.5 కోట్లకు తగ్గకుండా వసూళ్లు రాబట్టిన ప్రదీప్ రంగనాథన్ రెండో వారంలో మరింత ఆసక్తికరంగా వసూళ్లు రాబడుతున్నాడు. రోజురోజుకు వసూల్ చేస్తున్న కలెక్షన్లు వివరాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఇప్పటికే ఈ చిత్రం 2వ వారం పూర్తి చేస్తుంది. ప్రస్తుతం మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా ఏమాత్రం వసూళ్లు తగ్గడం లేదు.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. డ్రాగన్ డే1న రూ.6.5 కోట్ల వరకు ఇండియా నెట్ వసూల్ చేసింది. డే2న రూ.10.8 కోట్లు నెట్, డే3న రూ.12.75 కోట్లు నెట్, డే4న రూ.5.8 కోట్లు నెట్, డే5న రూ.5.1 కోట్లు నెట్, డే6న రూ.5.2 కోట్లు నెట్, డే7న రూ.4.5 కోట్ల నెట్ వసూల్ చేసి ఆశ్చర్య పరిచింది. మొదటి వారం పూర్తయే సరికి రూ.50.30 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇందులో తమిళంలో రూ.40.85 కోట్ల నెట్ అందుకుంది. తెలుగులో రూ.9.45 కోట్ల నెట్ వసూల్ చేయడం విశేషం.

ఇక రెండో వారంలో మరింత ఆసక్తికరంగా వసూళ్లు అందుకుందీ చిత్రం. డే8న రూ.4.7 కోట్ల నెట్, డే9న రూ.8.5 కోట్ల నెట్, డే10న రూ.9కోట్ల నెట్, డే11న రూ.2.25 కోట్లు నెట్, డే12న 2.25 కోట్ల నెట్, డే13న రూ.2.3 కోట్ల నెట్, డే14న రూ.2.15 కోట్ల నెట్ వసూల్ చేసి బాక్సాఫీస్ వద్ద 2వ వారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 'డ్రాగన్' మూడో వారంలోకి ఎంట్రీ ఇవ్వడంతోనూ మరింత ఆసక్తికరంగా వసూళ్లు రాబడుతోంది.
లేటెస్ట్ వసూళ్ల వివరాల్లోకి వస్తే.. డే15న 'డ్రాగన్' చిత్రానికి రూ.2.25 కోట్ల వరకు ఇండియా నెట్ వసూలైంది. 'తండేల్' లాంటి చిత్రాలు థర్డ్ వీక్ లో ఎంత వీక్ గా కలెక్షన్లు సాధించాయో తెలిసిందే. కానీ డ్రాగన్ కు మాత్రం పెద్దగా పోటీ ఏమీ లేకపోవడంతో వసూళ్ల దందా కొనసాగిస్తోంది. 3వ వారం ప్రారంభం కూడా రూ.2 కోట్లకు తగ్గకుండా వసూళ్లు రాబట్టడం ఆసక్తికరంగా మారింది. డే15 వరకు ఇండియా మొత్తంగా రూ.84.45 కోట్ల నెట్ వసూల్ చేసిందీ చిత్రం.

థర్డ్ వీక్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం సెకండ్ వీక్ పూర్తయ్యే సరికి రూ.31.9 కోట్ల వరకు ఇండియాలో నెట్ వసూల్ చేసింది. ఇందులో తమిళంలో రూ.25.75 కోట్ల నెట్, తెలుగులో రూ.6.15 కోట్ల నెట్ అందుకుంది. అయితే మొదటి వారంతో పోల్చితే రెండో వారం 36 శాతానికి వసూళ్లు పడిపోయాయి. కానీ థియేటర్లలో మాత్రం ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్' చిత్రమే సందడి చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటివరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.124.50 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇందులో ఇండియాలో రూ.84.43 కోట్ల నెట్, రూ.95 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసింది. 15 రోజుల్లో ఓవర్సీస్ లో రూ.29.50 కోట్ల గ్రాస్ అందుకుంది. త్వరలో ఈ చిత్రం రూ.150 కోట్ల క్లబ్ లో చేరనుంది. కమింగ్ ఆఫ్ ఏజ్ కామెడీ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేశారు. కయాదు లోహర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రూ.35 కోట్ల తో తెరకెక్కించారు.


Click it and Unblock the Notifications











