Dragon Day 16 Collections : ‘డ్రాగన్’ 16వ రోజు కలెక్షన్లు.. దంచికొడుతున్న ప్రదీప్ రంగనాథన్.. ఎన్నికోట్లంటే?
హీరో ప్రదీప్ రంగనాథన్ బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేస్తున్నాడు. చిన్న సినిమాతో థియేటర్లలోకి వచ్చిన ఈ యంగ్ హీరో తొలి రోజే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాడు. ఇప్పటికీ ఈ చిత్రం రెండువారాల పాటు థియేట్రికల్ రన్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం థర్డ్ వీక్ లోనూ ఈ చిత్రం ఆసక్తికరంగా వసూళ్లు సాధిస్తోంది. ఇక వీకెండ్స్ లో మరింత జోరుగా కలెక్షన్లు రాబడుతోంది.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. ఇండియాలో నెట్ వసూళ్లు ఇలా ఉన్నాయి. డ్రాగన్ డే1న రూ.6.5 కోట్ల నెట్ వసూళ్ చేసింది. డే2న రూ.10.8 కోట్లు నెట్, డే3న రూ.12.75 కోట్లు నెట్, డే4న రూ.5.8 కోట్లు నెట్, డే5న రూ.5.1 కోట్లు నెట్, డే6న రూ.5.2 కోట్లు నెట్, డే7న రూ.4.5 కోట్ల నెట్ వసూల్ చేసి ఆశ్చర్య పరిచింది. మొదటి వారం పూర్తయే సరికి రూ.50.30 లక్షల నెట్ వసూల్ చేసి ఆశ్చర్య పరిచింది. కాగా తెలుగు స్టేట్స్ లో రూ.40.85 కోట్ల నెట్, తెలుగులో రూ.9.45 కోట్ల నెట్ అందుకుంది.

ఇక సెకండ్ వీక్ లో డే8న రూ.4.7 కోట్ల నెట్, డే9న రూ.8.5 కోట్ల నెట్, డే10న రూ.9కోట్ల నెట్ అందుకుంది. డే11న రూ.2.25 కోట్లు నెట్ వసూల్ చేసింది. డే12న 2.25 కోట్ల నెట్, డే13న రూ.2.3 కోట్ల నెట్, డే14న రూ.2.10 కోట్ల నెట్, డే15న 2.05 కోట్ల ఇండియా నెట్ వసూళ్లు అందుకుంది. డే15వ రోజు వరకు మొత్తంగా ఇండియాలో రూ.84.55 కోట్ల నెట్ వసూల్ చేసింది. అందులో తమిళంలో రూ.68.25 కోట్లు, తెలుగులో రూ.16కోట్లు సంపాదించింది.
రెండు వారాల్లో జోరుగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం మూడో వారంలో కూడా ఏమాత్రం తగ్గడం లేదు. రూ.2 కోట్లకు తగ్గకుండా వసూళ్లు అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. కాగా డే16న మూడో శనివారం కావడంతో రూ.3.65 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసింది. ఇందులో కేవలం తమిళంలో రూ.3.05 కోట్ల నెట్, తెలుగులో రూ.60 లక్షల వసూళ్లు అందుకుంది. డే16తో ఇండియాలో రూ.87.90 కోట్ల వరకు నెట్ వసూళ్లు చేరాయి.
ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా డే16 వరకు రూ.132 కోట్లు కలెక్ట్ చేసింది. ఇండియా నెట్ రూ.87.90 కోట్లు కాగా, గ్రాస్ రూ.101.6 కోట్లు వసూల్ చేసింది. ఇక ఓవర్సీస్ లో 30.4 కోట్ల గ్రాస్ అందుకుని బ్లాక్ బాస్టర్ చిత్రంగా నిలిచింది. త్వరలో రూ.150 కోట్ల క్లబ్ లో చేరనుంది. కేవలం తమిళంలో రూ.71.3 కోట్ల నెట్ అందుకుంది. తెలుగులో రూ.16.6 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఏజిఎస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ లో ఫిబ్రవరి 21న విడుదలైన ఈ చిత్రానికి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. కయాదు లోహర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు గా నటించారు.


Click it and Unblock the Notifications











