Dragon Day 17 Collections : ‘డ్రాగన్’ 17వ రోజు కలెక్షన్లు.. ఈరేంజ్ వసూళ్లు ఏందయ్యా? ఎన్ని కోట్లంటే?

'డాగన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ రోజురోజుకు కలెక్షన్లు పెంచుతూ హల్ చల్ చేస్తున్నాడు. మీడియం బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. కలెక్షన్లలో మాత్రం ఓ రేంజ్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరింది. ప్రస్తుతం థర్డ్ వీక్ కు చేరుకున్న ఈ మూవీ వసూళ్లలో మాత్రం తగ్గనంటే తగ్గనంటోంది. ప్రదీప్ రంగనాథన్ మేజిక్ కు ప్రతి రోజూ ఆసక్తికరంగా వసూళ్లు అందుతున్నాయి.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. డ్రాగన్ చిత్రం మొదటి రోజు నుంచి ఇండియాలో నెట్ వసూళ్లు ఇలా ఉన్నాయి. డే1న రూ.6.5 కోట్ల నెట్, డే2న రూ.10.8 కోట్లు నెట్, డే3న రూ.12.75 కోట్లు నెట్, డే4న రూ.5.8 కోట్లు నెట్, డే5న రూ.5.1 కోట్లు నెట్, డే6న రూ.5.2 కోట్లు నెట్, డే7న రూ.4.5 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఫస్ట్ వీక్ పూర్తయే సరికి రూ.50.30 లక్షల నెట్ రాబట్టింది. ఇందులో తమిళం లో రూ.40.85 కోట్ల నెట్, తెలుగు స్టేట్స్ లో రూ.9.45 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది.

Pradeep Ranganathan Anupama Parameswaran Dragon Movie Day 17 Box Office Collections Worldwide

సెకండ్ వీక్ లో డే8న రూ.4.7 కోట్ల నెట్, డే9న రూ.8.5 కోట్ల నెట్, డే10న రూ.9కోట్ల నెట్, డే11న రూ.2.25 కోట్లు నెట్, డే12న 2.25 కోట్ల నెట్, డే13న రూ.2.3 కోట్ల నెట్, డే14న రూ.2.15 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇలా బాక్సాఫీస్ వద్ద రెండో వారంలో రూ.31.9 కోట్ల వసూళ్లు అందుకుంది. ఇందులో కేవలం తమిళంలో రూ.25.75 కోట్లు నెట్, తెలుగు స్టేట్స్ లో రూ.6.15 కోట్ల నెట్ అందుకుని ఆశ్చర్యపరించింది.

ప్రస్తుతం ఈ చిత్రం థర్డ్ వీక్ లోనూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. థర్డ్ వీకెండ్ కూడా కావడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. డే15న రూ.2.05 కోట్ల నెట్, డే16న రూ.3.65 కోట్ల నెట్ అందుకుంది. ఇక డే17న రూ.3 కోట్లకు పైగా ఇండియాలో నెట్ వసూల్ చేసింది. దీంతో మొత్తంగా డే17 వరకు రూ.90.90 కోట్ల వరకు ఇండియా నెట్ వసూళ్లు అందడం విశేషం. అయితే ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.2 కోట్లకు తగ్గకుండా వసూళ్లు రాబడుతుండటం విశేషం. మూడో వారం పూర్తయ్యే సరికి రూ.150 కోట్లకు దగ్గర్లో ఉంటుందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Take a Poll

ఇక డే17 వరకు 'డ్రాగన్' చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.134.46 కోట్లు కలెక్ట్ చేసింది. ఇండియా నెట్ రూ.90.69 కోట్లు వసూల్ కాగా, గ్రాస్ రూ.103.6 కోట్లు అందుకుంది. ఇక ఓవర్సీస్ లో 30.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్ చిత్రంగా నిలిచింది. త్వరలో రూ.150 కోట్ల క్లబ్ లో చేరేందుకు పరుగులు పెడుతోంది. కొత్త రిలీజెస్ ఉన్నప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో ఏమాత్రం జోరు తగ్గించడం లేదు. డే17 వరకు తమిళంలో రూ.73.76 కోట్ల నెట్ అందుకుంది. తెలుగులో రూ.16.93 కోట్ల నెట్ వసూల్ రాబట్టింది. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ లో ఫిబ్రవరి 21న విడుదల చేశారు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించగా.. కయాదు లోహర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు గా అలరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X