Dragon Day 18 Collections : ‘డ్రాగన్’ 18వ రోజు కలెక్షన్లు.. ప్రదీప్ రంగనాథన్ జోరుకు బ్రేకులు!
తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ 'డాగన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద రెండు వారాలకు పైగా కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇంకా వసూళ్లను రాబడుతూనే ఉంది. ఇప్పటి వరకు రోజురోజుకు కలెక్షన్లు పెంచుతూ హల్ చల్ చేసిందీ చిత్రం. మీడియం బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ.. కలెక్షన్లలో మాత్రం రెండు వారాలు ఏమాత్రం తగ్గలేదు. అయితే ఇక తాజాగా మాత్రం ఈ చిత్రానికి సంబంధించిన వసూళ్ల స్పీడ్ కు బాక్సాఫీస్ వద్ద బ్రేక్ లు పడ్డట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి వందకోట్ల క్లబ్ లోకి చేరిన సంగతి తెలిసిందే. ప్రజెంట్ 'డ్రాగన్' థర్డ్ వీక్ లో వసూళ్లు రాబడుతోంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. డే1న రూ.6.5 కోట్ల నెట్, డే2న రూ.10.8 కోట్లు నెట్, డే3న రూ.12.75 కోట్లు నెట్, డే4న రూ.5.8 కోట్లు నెట్, డే5న రూ.5.1 కోట్లు నెట్, డే6న రూ.5.2 కోట్లు నెట్, డే7న రూ.4.5 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇలా మొదటి వారం పూర్తయ్యే సరికి రూ.50.30 లక్షల నెట్ రాబట్టింది.

ఇక రెండో వారంలో డే8న రూ.4.7 కోట్ల నెట్, డే9న రూ.8.5 కోట్ల నెట్, డే10న రూ.9కోట్ల నెట్, డే11న రూ.2.25 కోట్లు నెట్, డే12న 2.25 కోట్ల నెట్, డే13న రూ.2.3 కోట్ల నెట్, డే14న రూ.2.15 కోట్ల నెట్ అందుకుంది. సెకండ్ వీక్ మొత్తంగా రూ.31.9 కోట్ల వసూళ్లు అందుకుంది. ఇందులో కేవలం తమిళంలో రూ.25.75 కోట్లు నెట్, తెలుగు స్టేట్స్ లో రూ.6.15 కోట్ల నెట్ వసూల్ చేయడం విశేషం.
ప్రస్తుతం థర్డ్ వీకెండ్ లో వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం.. డే15న రూ.2.05 కోట్ల నెట్, డే16న రూ.3.65 కోట్ల నెట్, డే17న రూ.3 కోట్లకు పైగా ఇండియాలో నెట్ అందుకుంది. కాగా డే18న రూ.1.15 కోట్ల నెట్ వసూల్ చేసింది. లేటెస్ట్ వసూళ్లు మాత్రం భారీగా పడిపోయాయి. రోజు రూ.2 నుంచి రూ.5 కోట్ల వరకు వసూల్ చేసిన ఈ చిత్రం నెమ్మదిగా మూడో వారంలో పట్టుకోల్పోతోంది. నిదానంగా వసూళ్ల జోరు తగ్గుతోంది. డే18 వరకు రూ.92.00 కోట్ల వరకు ఇండియా నెట్ వసూళ్లు అందాయి. ఆక్యుపెన్సీ అవరేజ్ గా 17 శాతం నమోదైంది.
ఇక డే18 వరకైతే 'డ్రాగన్' వరల్డ్ వైడ్ గా రూ.137 కోట్లు కలెక్ట్ చేసింది. ఇండియా నెట్ రూ.91.99 కోట్లు, రూ.103.6 కోట్ల గ్రాస్ అందుకుంది. ఇక ఓవర్సీస్ లో రూ.32 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. కేవలం ఆంధ్రా, తెలంగాణ సహా తెలుగు స్టేట్స్ లోనే రూ.17.21 కోట్ల వరకు నెట్ అందుకుంది. ఇక తమిళంలో రూ.74.78 కోట్ల వరకు నెట్ వసూళ్లు సాధించింది. ఇక రూ.150 కోట్ల క్లబ్ లో చేరుతుందా లేదా అనేది చూడాలి. అయితే ఈ చిత్రం త్వరలో హిందీ వెర్షన్ లోనూ రిలీజ్ కాబోతోంది. సౌత్ లో బ్లాక్ బాస్టర్ కావడంతో నార్త్ లోనూ విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 14న విడుదలైంది. కయాదు లోహర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు గా అలరించారు.


Click it and Unblock the Notifications











