Dragon Day 21 Collections : ‘డ్రాగన్’ 21వ రోజు కలెక్షన్లు.. తగ్గిన బాక్సాఫీస్ జోరు!

ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం 21 రోజులు సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుంది. మూడు వారాల పాటు మంచి వసూళ్లనును రాబ్టటింది. ఈ మూవీ ఫిబ్రవరి 14న తమిళంతోపాటు తెలుగులోనూ గ్రాండ్ గా విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ ఏరియాల్లో జోరుగానే వసూళ్లు అందుకుంటూ వస్తోంది. ఇక తాజాగా కలెక్షన్లు ఆసక్తికరంగా మారాయి. అయితే థర్డ్ వీక్ వచ్చే వరకు ఈ చిత్రం వసూళ్ల జోరును తగ్గించింది. అయినా రూ.కోటీ వరకు కలెక్షన్లు రాబడుతుండటం ఇంట్రెస్టింగ్ గా మారింది.

ట్రేడ్ లెక్కల ప్రకారం.. డే1న రూ.6.5 కోట్ల నెట్, డే2న రూ.10.8 కోట్లు నెట్, డే3న రూ.12.75 కోట్లు నెట్, డే4న రూ.5.8 కోట్లు నెట్, డే5న రూ.5.1 కోట్లు నెట్, డే6న రూ.5.2 కోట్లు నెట్, డే7న రూ.4.5 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇలా మొదటి వారం పూర్తయ్యే సరికి రూ.50.3 కోట్ల నెట్ వసూల్ అందుకుంది. ఇందులో తమిళంలో రూ.40.85 కోట్ల నెట్, తెలుగులో రూ.9.45 కోట్లను వసూళ్లు చేసింది. రెండో వారంలో డే8న రూ.4.7 కోట్ల నెట్, డే9న రూ.8.5 కోట్ల నెట్, డే10న రూ.9కోట్ల నెట్, డే11న రూ.2.25 కోట్లు నెట్, డే12న 2.25 కోట్ల నెట్, డే13న రూ.2.3 కోట్ల నెట్, డే14న రూ.2.15 కోట్ల నెట్ అందుకుంది. సెకండ్ వీక్ లో రూ.31.9 కోట్ల నెట్ వసూల్ చేసింది. తమిళంలో రూ.25.75 కోట్ల నెట్ రాబట్టగా... తెలుగులో రూ.6.15 కోట్ల నెట్ రాబట్టింది.

Pradeep Ranganathan Anupama Parameswaran Dragon Movie Day 21 Box Office Collections Worldwide

కాగా, సెకండ్ వీక్ పూర్తయ్యే సరికే ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ప్రస్తుతం థర్డ్ వీక్ కూడా పూర్తి చేసుకుంది. మూడో వారంలోనూ తమిళంలో, తెలుగులో జోరుగా వసూళ్లు సాధించింది. ఇక థర్డ్ వీక్ లో డే15న రూ.2.05 కోట్ల నెట్, డే16న రూ.3.65 కోట్ల నెట్, డే17న రూ.3 కోట్ల నెట్, డే18న రూ.1.15 కోట్ల నెట్, డే19న రూ.1.05 కోట్ల నెట్, డే20న రూ.90 లక్షల వరకు నెట్ వసూల్ చేసింది. ఇక డే21న రూ.75 లక్షల వరకు నెట్ వసూళ్లు రాబట్టింది.

Pradeep Ranganathan Anupama Parameswaran Dragon Movie Day 21 Box Office Collections Worldwide

ఇలా థర్డ్ వీక్ పూర్తయే సరికి ఇండియా నెట్ రూ.95.03 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇక ఇండియా గ్రాస్ రూ.108.75 కోట్ల వరకు అందుకుంది. ఓవర్సీస్ లో రూ.32.5 కోట్ల దాకా గ్రాస్ వసూల్ చేసింది. తమిళంలో, తెలుగులో ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. డే21 పూర్తయ్యే సరికి కేవలం తమిళంలో రూ.77.24 కోట్ల వరకు నెట్ వసూల్ అందుకుంది. మరోవైపు తెలుగులో రూ.17.79 కోట్ల వరకు నెట్ వసూల్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ.141.25 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అందుకుంది. ఈ మూవీని రూ.35 కోట్ల బడ్జెట్ తో ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో నిర్మితమైంది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. కయాదు లోహర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా మెప్పించారు.

Take a Poll

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X