Dragon Day 22 Collections : ‘డ్రాగన్’ 22వ రోజు కలెక్షన్లు.. తగ్గిన బాక్సాఫీస్ జోరు!

డ్రాగన్... చిన్న బడ్జెట్ తో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 3 వారాల పాటు మంచి వసూళ్లను అందుకుంది. తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే. మూడు వారాలు దాటే సరికి ఈ చిత్రం రూ.140 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం 4వ వారంలోకి ఎంట్రీ ఇచ్చినా 'డ్రాగన్' చిత్రం కలెక్షన్ల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు.

ట్రేడ్ వర్గాలు అందించే లెక్కల ప్రకారం.. డే1న రూ.6.5 కోట్ల నెట్, డే2న రూ.10.8 కోట్లు నెట్, డే3న రూ.12.75 కోట్లు నెట్, డే4న రూ.5.8 కోట్లు నెట్, డే5న రూ.5.1 కోట్లు నెట్, డే6న రూ.5.2 కోట్లు నెట్, డే7న రూ.4.5 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇలా 1వ వారం పూర్తయ్యే సరికి ఇండియాలో మొత్తంగా రూ.50.3 కోట్ల నెట్, ఇందులో తమిళంలో రూ.40.85 కోట్ల నెట్, తెలుగులో రూ.9.45 కోట్ల నెట్ వసూళ్లు చేసింది.

Pradeep Ranganathan Anupama Parameswaran Dragon Movie Day 22 Box Office Collections Worldwide

ఇక 2వ వారంలో డే8న రూ.4.7 కోట్ల నెట్, డే9న రూ.8.5 కోట్ల నెట్, డే10న రూ.9కోట్ల నెట్, డే11న రూ.2.25 కోట్లు నెట్, డే12న 2.25 కోట్ల నెట్, డే13న రూ.2.3 కోట్ల నెట్, డే14న రూ.2.15 కోట్ల నెట్ అందుకుంది. ఇలా సెకండ్ వీక్ లో ఇండియాలో రూ.31.9 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇందులోంచి తమిళంలో రూ.25.75 కోట్ల నెట్ రాబట్టగా.. తెలుగులో రూ.6.15 కోట్ల నెట్ అందుకుంది. సెకండ్ వీక్ పూర్తయ్యే సరికే ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరి ఆశ్చర్యపరిచింది.

3వ వారంలోనూ డ్రాగన్ చిత్రం జోరుగానే వసూళ్లు రాబట్టింది. థర్డ్ వీక్ లో డే15న రూ.2.05 కోట్ల నెట్, డే16న రూ.3.65 కోట్ల నెట్, డే17న రూ.3 కోట్ల నెట్, డే18న రూ.1.15 కోట్ల నెట్, డే19న రూ.1.05 కోట్ల నెట్, డే20న రూ.90 లక్షల వరకు నెట్ వసూల్ చేసింది. ఇక డే21న రూ.75 లక్షల వరకు నెట్ వసూల్ చేయగలిగింది. మొదటి రెండు వారాలతో పోత్చితే మూడో వారం కాస్తా వసూళ్లు తగ్గాయి. అయినా 3వ వారంలో ఈరేంజ్ వసూళ్లు అంటే గొప్పవిషయమనే చెప్పాలి. మూడో వారంలో ఇండియాలో రూ.12.8 కోట్ల నెట్ వసూల్ చేసింది. తమిళంలో రూ.10.6 కోట్ల నెట్ల, తెలుగులో రూ.2.2 కోట్ల నెట్ అందుకుంది. ఇక 4వ వారం ప్రారంభం అవడంతో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Pradeep Ranganathan Anupama Parameswaran Dragon Movie Day 22 Box Office Collections Worldwide

లేటెస్ట్ ట్రేడ్ లెక్కల ప్రకారం.. డే22న ఈ చిత్రం ఇండియాలో రూ.87 లక్షల నెట్ సాధించింది. తమిళంలో రూ.68 లక్షలు, తెలుగులో రూ.19 లక్షల నెట్ వసూళ్లు అందుకుంది. ఇలా డే22 వరకు డ్రాగన్ తమిళంలో రూ.77.88 కోట్ల నెట్, తెలుగులో రూ.17.99 కోట్ల నెట్ వసూళ్లు అందుకుంది. మరోవైపు వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు రూ.143.47 కోట్ల గ్రాస్ వసూల్ చేసిందీ చిత్రం. ఇండియాలో రూ.95.87 కోట్ల నెట్ అందుకుంది. ఇండియా గ్రాస్ రూ.110.77 కోట్లు కావడం విశేషం. ఓవర్సీస్ లో రూ.32.7 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఇక ఈ చిత్రానికి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించగా.. కయాదు లోహర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు.

Take a Poll

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X