Dragon Day 23 Collections : ‘డ్రాగన్’ 23వ రోజు కలెక్షన్లు.. ఎన్ని కోట్లు? ఇక టార్గెట్ అదే!

ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసులు రాబడుతూనే ఉంది. మూడు వారాలు దాటినా... స్టడీగానే వసూళ్లు అందుకుంటూ వస్తోంది. కాగా ఈ చిత్రం 4వ వారంలో చాలా ఆసక్తికరంగా కలెక్షన్లు వసూల్ చేస్తూ వస్తోంది. ఇక ప్రదీప్ రంగనాథన్ ఇప్పటికే ఈ చిత్రంతో రూ.100 కోట్ల క్లబ్ లో రెండోసారి జాయిన్ అయ్యారు. మొదట 'లవ్ టుడే'తో రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీతో మరో రికార్డును తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఆమేరకు చాలా దగ్గర్లో ఉన్నాడు.

రూ.35 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వందశాతం సక్సెస్ ఫుల్ అయ్యింది. 4వ వారంలోనూ థియేట్రికల్ రన్ విజయవంతంగా కొనసాగుతుండటం విశేషం. దీంతో ఈ మూవీ డే23న ఎన్నికోట్లు కలెక్ట్ చేసిందో చూద్దాం. ముందుగా... మొదటి, రెండు, మూడో వారాల్లో ఈ చిత్రం సాధించిన వసూళ్ల వివరాలను ఒకసారి పరిశీలిద్దాం. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. డే1న రూ.6.5 కోట్ల నెట్, డే2న రూ.10.8 కోట్లు నెట్, డే3న రూ.12.75 కోట్లు నెట్, డే4న రూ.5.8 కోట్లు నెట్, డే5న రూ.5.1 కోట్లు నెట్, డే6న రూ.5.2 కోట్లు నెట్, డే7న రూ.4.5 కోట్ల నెట్ వసూల్ చేసింది.

Pradeep Ranganathan Anupama Parameswaran Dragon Movie Day 23 Box Office Collections Worldwide

1వ వారం పూర్తయ్యే సరికి ఇండియాలో మొత్తంగా రూ.50.3 కోట్ల నెట్, ఇందులో తమిళంలో రూ.40.85 కోట్ల నెట్, తెలుగులో రూ.9.45 కోట్ల నెట్ వసూళ్లు చేసింది... 2వ వారంలో డే8న రూ.4.7 కోట్ల నెట్, డే9న రూ.8.5 కోట్ల నెట్, డే10న రూ.9కోట్ల నెట్, డే11న రూ.2.25 కోట్లు నెట్, డే12న 2.25 కోట్ల నెట్, డే13న రూ.2.3 కోట్ల నెట్, డే14న రూ.2.15 కోట్ల నెట్ అందుకుంది. ఇలా సెకండ్ వీక్ ఇండియాలో రూ.31.9 కోట్ల నెట్ వసూల్ చేయగా.. తమిళంలో రూ.25.75 కోట్ల నెట్, తెలుగులో రూ.6.15 కోట్ల నెట్ అందుకుంది. 2వ పూర్తయ్యే సరికే రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది.

ఇక 3వ వారంలోనూ డే15న రూ.2.05 కోట్ల నెట్, డే16న రూ.3.65 కోట్ల నెట్, డే17న రూ.3 కోట్ల నెట్, డే18న రూ.1.15 కోట్ల నెట్, డే19న రూ.1.05 కోట్ల నెట్, డే20న రూ.90 లక్షల నెట్, డే21న రూ.75 లక్షల వరకు నెట్ వసూల్ చేయగలిగింది. థర్డ్ వీక్ లోనూ ప్రతి రోజూ రూ.2 కోట్ల నుంచి రూ.1కోటీ వరకు వసూళ్లు సాధించి ఆశ్చర్యపరించింది. చిన్న సినిమాకు అది కూడా మూడో వారంలో రూ.2 కోట్ల బిజినెస్ అంటే మాములు విషయం కాదు. పెద్దసినిమాలేవీ లేకపోవడంతో ప్రదీప్ రంగనాథన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్నారు.

Take a Poll

4వ వారంలో.. డే22న ఈ చిత్రం ఇండియాలో రూ.75 లక్షల నెట్ సాధించింది. తమిళంలో రూ.60 లక్షలు, తెలుగులో రూ.15 లక్షల నెట్ అందుకుంది. ఇక డే23న రూ.98 లక్షల ఇండియా నెట్ వసూల్ చేసి 30 శాతానికి వసూళ్లను పెంచేసింది. తమిళంలో రూ.79 లక్షలు, తెలుగులో రూ.19 లక్షలు వసూలయ్యాయి. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 144.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇండియాలో రూ.96.73 కోట్ల నెట్, 111.75 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఓవర్సీస్ లో రూ.32.75 కోట్ల వరకు కలెక్షన్ సాధించింది. ఇక ఈ చిత్రం రూ.150 కోట్ల క్లబ్ లో చేరే టార్గెట్ గా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X