Dragon Day 24 Collections: ‘డ్రాగన్’ 24వ రోజు కలెక్షన్లు.. 4వ వారంలోనూ అస్సలు తగ్గని ప్రదీప్ రంగనాథన్!
తమిళ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. చిన్న బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం పెద్ద సినిమాలకు వచ్చిన రేంజ్ నే వసూళ్లు వస్తుండటం విశేషం. అది పెద్ద నెంబర్ అమౌంట్ కాకున్నా.. ఆ స్ట్రక్చర్ లో కలెక్షన్లు చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిత్రం విడుదలైన 4వ వారంలోనూ స్టడీగా వసూళ్లు చేస్తుండటం విశేషం. కాగా లేటెస్ట్ కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
'డ్రాగన్' చిత్రం రూ.35 కోట్ల బడ్జెట్ తెరకెక్కింది. ఫిబ్రవరి 21న తమిళంలో పాటు తెలుగులోనూ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలైంది. ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించి విడుదల చేయగా.. బాక్సాఫీస్ వద్ద తాండవం చూపిస్తోంది. ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ చిత్రం వసూళ్లు వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. డే1న రూ.6.5 కోట్ల నెట్, డే2న రూ.10.8 కోట్లు నెట్, డే3న రూ.12.75 కోట్లు నెట్, డే4న రూ.5.8 కోట్లు నెట్, డే5న రూ.5.1 కోట్లు నెట్, డే6న రూ.5.2 కోట్లు నెట్, డే7న రూ.4.5 కోట్ల నెట్ వసూళ్లు అందుకుంది.

1వ వారంలో మొత్తంగా రూ.50.3 కోట్ల ఇండియా నెట్, ఇందులో తమిళంలో రూ.40.85 కోట్ల నెట్, తెలుగులో రూ.9.45 కోట్ల నెట్ వసూలైంది. ఇక 2వ వారంలో డే8న రూ.4.7 కోట్ల నెట్, డే9న రూ.8.5 కోట్ల నెట్, డే10న రూ.9కోట్ల నెట్, డే11న రూ.2.25 కోట్లు నెట్, డే12న 2.25 కోట్ల నెట్, డే13న రూ.2.3 కోట్ల నెట్, డే14న రూ.2.15 కోట్ల నెట్ రాట్టింది. 2వ వారంలో కేవలం ఇండియాలోనే రూ.31.9 కోట్ల నెట్ రాబట్టగా.. తమిళంలో రూ.25.75 కోట్ల నెట్, తెలుగులో రూ.6.15 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇలా 2వ వారం పూర్తయ్యే సరికి వచ్చిన వసూళ్లతో రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే.
ఆపైన 3వ వారంలో డే15న రూ.2.05 కోట్ల ఇండియా నెట్, డే16న రూ.3.65 కోట్ల నెట్, డే17న రూ.3 కోట్ల నెట్, డే18న రూ.1.15 కోట్ల నెట్, డే19న రూ.1.05 కోట్ల నెట్, డే20న రూ.90 లక్షల నెట్, డే21న రూ.75 లక్షల వరకు నెట్ వసూల్ రాబట్టగలిగింది. ఇలా 3వ వారంలో రూ.12.8 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసింది. ఇందులో తమిళంలో రూ.10.6 కోట్ల నెట్, తెలుగులో రూ.2.2 కోట్ల నెట్ అందుకుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ 4వ వారంలోకి ఎంట్రీ ఇచ్చినా స్టడీగానే వసూళ్లు రాబడుతోంది.
4వ వారంలోని డే22న ఈ చిత్రం ఇండియాలో రూ.75 లక్షల నెట్, డే23న రూ.98 లక్షల ఇండియా నెట్ వసూల్ చేసింది. కాగా డే24న ఈ చిత్రం రూ.98 లక్షల వరకు నెట్ అందుకుంది. ఇందులో తమిళంలో రూ.83 లక్షలు, తెలుగులో రూ.15 లక్షల నెట్ వసూళ్లు అందుకుంది. ఇలా డే24 పూర్తయ్యే సరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.146 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇండియాలో రూ.97.71 కోట్ల నెట్, 112.73 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఓవర్సీస్ లో రూ.32.75 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. 4వ వారం పూర్తయ్యే సరికి ఈ చిత్రం ఈజీగా రూ.150 కోట్ల క్లబ్ లో చేరుకుంటుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కయాదు లోహర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లుగా అలరించారు.


Click it and Unblock the Notifications











