Dragon Day 25 Collections : ‘డ్రాగన్’ 25వ రోజు కలెక్షన్లు.. ప్రదీప్ రంగనాథన్ మరో సెన్సేషన్!

తమిళంలో రూపుదిద్దుకున్న 'డ్రాగన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఫిబ్రవరి 21న గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రంలో యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించారు. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్, క్రేజీ హీరోయిన్ కయాదు లోహర్ హీరోయిన్లుగా అలరించారు. విడుదలైన మొదటిరోజు నుంచే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్ లో చేరి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. అయితే 4వ వారంలోనూ ఈ చిత్రానికి బాక్సాఫీస్ కలెక్షన్లు వస్తుండటం ఆసక్తికరంగా మారింది.

'డ్రాగన్' చిత్రం రూ.35 కోట్ల బడ్జెట్ తెరకెక్కి అంతకు నాలుగింతల వసూళ్లను రాబడుతోంది. ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై తమిళంలో పాటు తెలుగులోనూ, అలాగే ఓవర్సీస్ లోనూ గ్రాండ్ గా విడుదలైంది. మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద తాండవం చూపిస్తోంది. ఇక ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. డే1న రూ.6.5 కోట్ల నెట్, డే2న రూ.10.8 కోట్లు నెట్, డే3న రూ.12.75 కోట్లు నెట్, డే4న రూ.5.8 కోట్లు నెట్, డే5న రూ.5.1 కోట్లు నెట్, డే6న రూ.5.2 కోట్లు నెట్, డే7న రూ.4.5 కోట్ల నెట్ వసూళ్లు అందుకుంది.

Pradeep Ranganathan Anupama Parameswaran Dragon Movie Day 25 Box Office Collections Worldwide

ఫస్ట్ వీక్ లో రూ.50.3 కోట్ల ఇండియా నెట్, ఇందులో తమిళంలో రూ.40.85 కోట్ల నెట్, తెలుగులో రూ.9.45 కోట్ల నెట్ వసూలైంది. ఇక 2వ వారంలో డే8న రూ.4.7 కోట్ల నెట్, డే9న రూ.8.5 కోట్ల నెట్, డే10న రూ.9కోట్ల నెట్, డే11న రూ.2.25 కోట్లు నెట్, డే12న 2.25 కోట్ల నెట్, డే13న రూ.2.3 కోట్ల నెట్, డే14న రూ.2.15 కోట్ల నెట్ రాట్టింది. 2వ వారంలో కేవలం ఇండియాలోనే రూ.31.9 కోట్ల నెట్ రాబట్టగా.. తమిళంలో రూ.25.75 కోట్ల నెట్, తెలుగులో రూ.6.15 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇలా 2వ వారం పూర్తయ్యే సరికి వచ్చిన వసూళ్లతో రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే.

ఇక 3వ వారంలో డే15న రూ.2.05 కోట్ల ఇండియా నెట్, డే16న రూ.3.65 కోట్ల నెట్, డే17న రూ.3 కోట్ల నెట్, డే18న రూ.1.15 కోట్ల నెట్, డే19న రూ.1.05 కోట్ల నెట్, డే20న రూ.90 లక్షల నెట్, డే21న రూ.75 లక్షల వరకు నెట్ వసూల్ రాబట్టగలిగింది. 3వ వారంలో రూ.12.8 కోట్ల ఇండియా నెట్ వసూల్ చేసింది. వీటిలో తమిళ్ రూ.10.6 కోట్ల నెట్, తెలుగు రూ.2.2 కోట్ల నెట్ రాబట్టింది. ఇక 4వ వారంలోకి ఎంట్రీ ఇచ్చినా 'డ్రాగన్' వసూళ్లు స్టడీగానే కొనసాగుతున్నాయి.

4వ వారంలో డే22న ఇండియాలో రూ.75 లక్షల నెట్, డే23న రూ.98 లక్షల నెట్, డే24న రూ.98 లక్షల నెట్ వసూళ్లు అందుకుంది. కాగా డే25న రూ.43 లక్షల నెట్ వసూల్ చేసింది. మార్చి17న వసూళ్లు భారీగా తగ్గిపోయాయి. తమిళంలో రూ.38 లక్షలు, తెలుగులో రూ.5 లక్షలు మాత్రమే వసూల్ చేసింది. ప్రస్తుతం వసూళ్లు భారీగా తగ్గిపోయాయి. ఇక వరల్డ్ వైడ్ గా రూ.146.97 కోట్ల గ్రాస్, ఇండియా రూ.98.73 కోట్ల నెట్, రూ.114.07 కోట్ల ఇండియా గ్రాస్, ఓవర్సీస్ లో రూ.32.9 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది. అయితే ఈ చిత్రం మరో రూ.3 కోట్లు వసూళ్లు చేస్తే.. రూ.150 కోట్ల క్లబ్ లోకి చేరి సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది. ప్రదీప్ కు ఇది రెండో సినిమా అయినా రూ.150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయబోతుండటం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ చిత్రానికి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు.

Take a Poll

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X