Dragon Day 9 Collections : ‘డ్రాగన్’ 9వ రోజు కలెక్షన్లు.. ప్రదీప్ రంగనాథన్ సెన్సేషన్ గా వసూళ్లు.. ఎంతంటే?

'లవ్ టుడే' చిత్రంతో రెండేళ్ల కింద హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ప్రదీప్ రంగనాథన్. తమిళ హీరో అయినప్పటికీ ఆయన నటన, స్కిల్స్, ప్రవర్తనతో తెలుగు వారి గుండెల్లోనూ స్థానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్' చిత్రంతో సెన్సేషన్ గా మారిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. అంతే కాదు.. బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.50 కోట్ల క్లబ్ లో చేరింది. నెక్ట్స్ టార్గెట్ కోసం పరుగులు పెడుతోంది.

'డ్రాగన్' కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే.. మొదటి రోజు ఇండియా నెట్ వసూళ్లు రూ.6.5 కోట్లు అందాయి. ఇక డే2న రూ.10.8 కోట్లు నెట్, డే3న రూ.12.75 కోట్లు నెట్, డే4న రూ.5.8 కోట్లు నెట్, డే5న రూ.5.1 కోట్లు నెట్, డే6న రూ.5.2 కోట్లు నెట్, డే7న రూ.4.5 కోట్ల నెట్ సాధించింది. రెండో వారంలో డే8న రూ.4.7 కోట్ల నెట్ అందుకుంది. అందులో తమిళంలో రూ.3.85 కోట్లు కాగా.. తెలుగులో రూ.0.85 కోట్లు అందుకుంది. ఇక డే9న ఇండియాలో నెట్ రూ.7.25 కోట్లు అందుకుంది. ఇందులో తమిళంలో రూ.5.75 కోట్లు కాగా.. తెలుగులో రూ.1.5 కోట్ల నెట్ వసూళ్లు చేసింది. వీటికి మరిన్ని కలెక్షన్లు యాడ్ కావాల్సి ఉంది.

Pradeep Ranganathan Anupama Parameswaran Dragon Movie Day 9 Box Office Collections Worldwide

కాగా... డే9న రెండో శనివారం 'డ్రాగన్'కు భారీ వసూళ్లు అందాయి. మొదటి వారంతో పోల్చితే ఈ వారం 60 శాతం వసూళ్లు పెరగటం విశేషం. ఇక తెలుగు స్టేట్స్ లోనూ రూ. కోటీన్నర అందుకోవడం ఆసక్తికరంగా మారింది. ప్రదీప్ రంగనాథన్ తమిళంతో పాటు తెలుగు స్టేట్స్ లోనూ రోజుకు రూ.కోటీ పైనే వసూళ్లు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జాతర కొనసాగిస్తోంది.

ఇక 'డ్రాగన్' మొదటి వారం పూర్తయి ఎనిమిదో రోజు వరకు వరల్డ్ వైడ్ గా రూ.84.75 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇండియాలో రూ.55 కోట్లకు పైగా నెట్, రూ.63.65 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఎనిమిది రోజుల్లో ఓవర్సీస్ లో రూ.21 కోట్ల గ్రాస్ అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రమే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. త్వరలో బాలీవుడ్ సెన్సేషన్ ఫిల్మ్ 'ఛావా' దిగుతుండటంతో అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

మరోవైపు ఈ చిత్రం కేవలం తమిళంలోనే డే9 వరకు మొత్తంగా రూ.5045 కోట్లు నెట్ వసూళ్లు చేసింది. తెలుగు స్టేట్స్ లో రూ.11.8 కోట్ల నెట్ అందుకుంది. రోజురోజుకు వసూళ్లు పెరుగుతూనే ఉన్నాయి. వీకెండ్ లో మాత్రం దుమ్ములేపుతోంది. వరల్డ్ వైడ్ గా రూ.84.75 కోట్లు వసూళ్లు చేసిన ఈ చిత్రం త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహార్ నటించారు. ఏజీఎస్ తమిళంలో సొంతంగా రిలీజ్ చేసుకోగా.. తెలుగులో ఏషియన్ సురేష్ డిస్టిబ్యూటర్స్ విడుదల చేశారు.

More from Filmibeat

Read more about: pradeep ranganathan dragon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X