Don't Miss!
- News
తెలుగు రాష్ట్రాల్లో మరో వందే భారత్ సిద్దం - ట్రయిల్ రన్ పూర్తి : ఆ రెండు స్టేషన్ల మధ్య..!!
- Lifestyle
మొదటి నెలల్లో గర్భస్రావం జరగడానికి కారణాలు, ఈ చిట్కాలతో సేఫ్గా ఉండొచ్చు
- Finance
adani: పెట్టుబడులు తరలిపోతున్న వేళ.. అదానీ కంపెనీకి శుభవార్త !!
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు నో ఛాన్స్!.. పాండ్యాకు మూడో టీ20లో అగ్ని పరీక్ష!
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
Love Today Telugu Day 2 Collections లవ్ టుడేకు రెండో రోజు అన్ని కోట్లు.. మరో 60 లక్షలు వస్తే ఆ రికార్డు!
తమిళ సినీ చిత్ర పరిశ్రమలో కోమలి సినిమాతో మంచి దర్శకుడిగా గుర్తింపు పొందారు ప్రదీప్ రంగనాథన్. తాజాగా ఆయన హీరోగా స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం లవ్ టుడే. ఎలాంటి అంచనాలు లేకుండా తమిళనాట నవంబర్ 4న విడుదలై సూపర్ సక్సెస్ సాధించింది ఈ మూవీ. దీంతో ఈ సినిమాను తెలుగులోకి ప్రముఖ నిర్మాత దిల్ రాజు తీసుకొచ్చారు.
నవంబర్ 25న తెలుగులో విడుదలైన ప్రదీప్ రంగనాథన్ మూవీ లవ్ టుడే మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతోంది. అలాగే కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కొల్లగొడుతోంది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో లవ్ టుడే 2 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాళ్లోకి వెళితే..

రూ. 5 కోట్ల బడ్జెట్ తో..
డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ మొదటి సారి హీరోగా నటించిన చిత్రం లవ్ టుడే. సోషల్ ఎలిమెంట్స్ కు కామెడీ హంగులను అద్ది ఫైనల్ గా మంచి మెసేజ్ ఇవ్వడం ప్రదీప్ రంగనాథన్ శైలి. మళ్లీ అలాగే ఆయన తెరకెక్కించిన సినిమానే లవ్ టుడే. సుమారు రూ. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట రూ. 70 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. తమిళంలో వసూళ్ల పరంగా జైత్రయాత్ర కొనసాగిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేసి అదే టైటిల్ తో విడుదల చేశారు.

దిల్ రాజుకు థియేట్రికల్ హక్కులు..
తమిళంలో ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించి హీరోగా నటించి మెప్పించిన లవ్ టుడే చిత్రం తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఫ్యాన్సీ రేటును సొంతం చేసుకొంది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను రూ. 2.7 కోట్లకు టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు తీసుకొన్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ. 3 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది.

లవ్ టుడే థియేటర్స్ కౌంట్..
స్మార్ట్ ఫోన్, లవ్, సీక్రెట్స్ వంటి తదితర అంశాలతో తెరకెక్కిన లవ్ టుడే చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా తమిళంలో మంచి విజయం సాధించడంతో తెలుగులో కూడా హిట్ అవుతుందన్న నమ్మకంతో రిలీజ్ చేశారు. లవ్ టుడే చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో 285 థియేటర్లకుపైగా విడుదల చేశారు. లవ్ అండ్ రొమాంటిక్ సినిమా అయిన ఈ చిత్రాన్ని నైజాంలో 150కిపైగా, సీడెడ్‌లో 60కి పైగా, ఆంధ్రాలో 180కి పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు.

2వ రోజు వచ్చిన కలెక్షన్స్..
కోలీవుడ్ హీరోయిన్ ఇవానా తన అందం, అభినయంతో ఆకట్టుకున్న లవ్ టుడే సినిమా తెలుగులోనూ మంచి వసూళ్లతో స్టార్ట్ అయింది. లవ్ టుడే చిత్రం మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఏరియాలు కలుపుకుని రూ. 2.22 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అలాగే రెండో రోజు రూ. 2.35 కోట్ల గ్రాస్ రాబట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు చేరువలో ఉండటమే కాకుండా మొదటి వారంలోనే లాభాలు అందుకునే అవకాశం ఉంది.

రెండు రోజుల్లో సాధించిన వసూళ్లు..
లవ్ అండ్ ఫ్రస్టేషన్, స్మార్ట్ ఫోన్ లో సీక్రెట్స్ అంటూ యూత్ కు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఎంచుకున్న డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ దాన్ని అందరికీ అర్థమయ్యేలా తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. దీంతో ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ అందుతోంది. ఫలితంగా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో లవ్ టుడే సినిమాకు 2 రోజుల్లో నైజాంలో రూ. 1.88 కోట్లు, సీడెడ్ లో రూ. 52 లక్షలు, ఆంధ్రాలో రూ. 2.17 కోట్లతో కలిపి రూ. 4.57 కోట్ల గ్రాస్, రూ. 2.40 షేర్ వసూలైంది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు ఎంత రావాలంటే..
క్రేజీ కాన్సెప్ట్ తో వచ్చిన తమిళ చిత్రం లవ్ టుడేకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.7 థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3 కోట్లుగా నమోదైంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల్లో రూ. 2.40 షేర్ వసూలు చేసింది. అంటే ఇంకో రూ. 60 లక్షలు వస్తే ఈ లవ్ టుడే సినిమా క్లీన్ హిట్ స్టేటస్ అందుకుంటుంది. ఈ టార్గెట్ ఒక్క రోజులో సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే లవ్ టుడే మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాగా రికార్డ్ కొట్టినట్లే.