twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Love Today Telugu Day 3 Collections 3 రోజుల్లోనే లవ్ టుడేకు అన్ని లాభాలు.. ఆ సినిమాగా రికార్డు!

    |

    తమిళ సినీ ఇండస్ట్రీలో మొదటి సినిమాతో సూపర్ క్రేజ్ అందుకున్న డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్. 2019లో వచ్చిన కోమలి సినిమాను తెరకెక్కించి బెస్ట్ డెబ్యుటంట్ డైరెక్టర్ గా సైమా అవార్డు అందుకున్నాడు. తాజాగా మరోసారి తన దర్శకత్వ ప్రతిభ చూపించిన చిత్రం లవ్ టుడే. ఎలాంటి అంచనాలు లేకుండా తమిళనాట నవంబర్ 4న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో నవంబర్ 25న విడుదలైన లవ్ టుడే చిత్రం మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో లవ్ టుడే 3 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాళ్లోకి వెళితే..

    రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు..

    రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు..

    తమిళ సినీ చిత్ర పరిశ్రమలో కోమలి సినిమాతో మంచి దర్శకుడిగా గుర్తింపు పొందారు ప్రదీప్ రంగనాథన్. తాజాగా ఆయన హీరోగా స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం లవ్ టుడే. సోషల్ ఎలిమెంట్స్ కు కామెడీ హంగులను అద్ది ఫైనల్ గా మంచి మెసేజ్ ఇవ్వడం ప్రదీప్ రంగనాథన్ శైలి. మళ్లీ అలాగే ఆయన తెరకెక్కించిన సినిమానే లవ్ టుడే. సుమారు రూ. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట రూ. 70 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది.

    బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా అన్ని కోట్లు..

    బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా అన్ని కోట్లు..

    తమిళంలో ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించి హీరోగా నటించి మెప్పించిన లవ్ టుడే చిత్రాన్ని అదే టైటిల్ తో తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ఈ తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఫ్యాన్సీ రేటును సొంతం చేసుకొంది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను రూ. 2.7 కోట్లకు టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు తీసుకొన్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ. 3 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది.

    ఎన్ని థియేటర్లలో రిలీజైందంటే..

    ఎన్ని థియేటర్లలో రిలీజైందంటే..

    స్మార్ట్ ఫోన్, లవ్, సీక్రెట్స్ వంటి తదితర అంశాలతో తెరకెక్కిన లవ్ టుడే చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా తమిళంలో మంచి విజయం సాధించడంతో తెలుగులో కూడా హిట్ అవుతుందన్న నమ్మకంతో రిలీజ్ చేశారు. లవ్ టుడే చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో 285 థియేటర్లకుపైగా విడుదల చేశారు. లవ్ అండ్ రొమాంటిక్ సినిమా అయిన ఈ చిత్రాన్ని నైజాంలో 150కిపైగా, సీడెడ్‌లో 60కి పైగా, ఆంధ్రాలో 180కి పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు.

    3వ రోజు వచ్చిన కలెక్షన్స్..

    3వ రోజు వచ్చిన కలెక్షన్స్..

    మలయాళ ముద్దుగుమ్మ ఇవానా షాజీ తన అందం, అభినయంతో ఆకట్టుకున్న లవ్ టుడే చిత్రం తెలుగులోనూ మంచి వసూళ్లతో స్టార్ట్ అయింది. లవ్ టుడే చిత్రం 2వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఏరియాలు కలుపుకుని రూ. 2.35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా.. 3వ రోజు రూ. 2.38 కోట్ల గ్రాస్ రాబట్టింది. అంటే రోజురోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతోంది లవ్ టుడే చిత్రం.

    3 రోజుల్లో సాధించిన వసూళ్లు..

    3 రోజుల్లో సాధించిన వసూళ్లు..

    లవ్ అండ్ ఫ్రస్టేషన్, స్మార్ట్ ఫోన్ లో సీక్రెట్స్ అంటూ యూత్ కు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఎంచుకున్న డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ దాన్ని అందరికీ అర్థమయ్యేలా తెరకెక్కించి విజయం సాధించారు. దీంతో ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ అందుతోంది. ఫలితంగా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో లవ్ టుడే సినిమాకు 3 రోజుల్లో నైజాంలో రూ. 3.15 కోట్లు, సీడెడ్ లో రూ. 74 లక్షలు, ఆంధ్రాలో రూ. 3.06 కోట్లతో కలిపి రూ. 6.95 కోట్ల గ్రాస్, రూ. 3.61 కోట్ల షేర్ వసూలైంది.

    వచ్చిన లాభం ఎంతంటే..

    వచ్చిన లాభం ఎంతంటే..

    క్రేజీ కాన్సెప్ట్ తో వచ్చిన కోలీవుడ్ మూవీ లవ్ టుడేకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.7 థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3 కోట్లుగా నమోదైంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో రూ. 3.61 షేర్ వసూలు చేసింది. అంటే లవ్ టుడే చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడమే కాకుండా రూ. 61 లక్షలు లాభాన్ని చూసింది.

    19వ సినిమాగా రికార్డు..

    19వ సినిమాగా రికార్డు..

    యూత్ ఫుల్ లవ్ అండ్ ఎంటర్టైనర్ గా వచ్చిన తమిళ డబ్బింగ్ చిత్రం లవ్ టుడే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసి రూ. 61 లక్షలు లాభం తెచ్చుకోవడంతో ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన డబ్బింగ్ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే టాలీవుడ్ లో 2022 సంవత్సరంలో క్లీన్ హిట్ గా నిలిచిన 19వ సినిమాగా రికార్డు నెలకొల్పింది ఈ లవ్ టుడే మూవీ.

    English summary
    Tamil Dubbed Movie Love Today Telugu Version 3 Days Box Office Collection Is Rs. 3.61 Cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X