For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Love Today Telugu Day 4 Collections కలెక్షన్లు తగ్గినా సూపర్ హిట్ గా లవ్ టుడే.. 4 రోజుల్లో లాభం ఎంతంటే?

    |

    ఓవైపు హీరోగా నటిస్తూ మరోవైపు దర్శకత్వం వహించడం అంటే మాములు విషయం కాదు. అంతేకాకుండా ఆ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ గా తెరకెక్కించడం అతికొద్దిమందికి మాత్రమే సాధ్యం అవుతుంది. అలా ఇటీవల రిషబ్ శెట్టి కాంతార సినిమాతో నిరూపించుకున్నారు. ఇప్పుడు అలాగే హీరో అండ్ డైరెక్టర్ బాధ్యతలతో సినిమా తెరకెక్కించి హిట్ కొట్టారు ప్రదీప్ రంగనాథన్. ఆయన హీరోగా, స్వీయ దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా లవ్ టుడే. తమిళనాట నవంబర్ 4న విడుదలై ఘన విజయం సాధించిన ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయి విడుదలైంది. ప్రస్తుతం క్లీన్ హిట్ టాక్ తో కలెక్షన్ల పరంగానూ దూసుకుపోతోంది. లవ్ టుడే 4 రోజుల బాక్సాఫీస్ వసూళ్ల వివరాళ్లోకి వెళితే..

    తమిళనాట ఘన విజయం..

    తమిళనాట ఘన విజయం..

    కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మొదటి సినిమాతో సూపర్ క్రేజ్ అందుకున్న డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్. 2019లో వచ్చిన కోమలి సినిమాను తెరకెక్కించి బెస్ట్ డెబ్యుటంట్ డైరెక్టర్ గా సైమా అవార్డు అందుకున్నాడు. తాజాగా మరోసారి తన దర్శకత్వ ప్రతిభ చూపించిన చిత్రం లవ్ టుడే. కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం తమిళనాట నవంబర్ 4న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి తీసుకొచ్చారు.

    ఫ్యాన్సీ రేటుకు థియేట్రికల్ రైట్స్..

    ఫ్యాన్సీ రేటుకు థియేట్రికల్ రైట్స్..

    తమిళ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించి హీరోగా మెప్పించిన లవ్ టుడే చిత్రాన్ని అదే టైటిల్ తో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఫ్యాన్సీ రేటును సొంతం చేసుకొంది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను రూ. 2.7 కోట్లకు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు చేజిక్కించుకున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3 కోట్లుగా నమోదైంది.

    లవ్ టుడే రిలీజైన థియేటర్స్..

    లవ్ టుడే రిలీజైన థియేటర్స్..

    లవ్, రిలేషన్ షిప్స్, సీక్రెట్స్ వంటి తదితర ఆసక్తికర అంశాలతో తెరకెక్కిన లవ్ టుడే చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా తమిళంలో మంచి విజయం సాధించడంతో తెలుగులో కూడా హిట్ అవుతుందన్న నమ్మకంతో రిలీజ్ చేశారు. లవ్ టుడే చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో 285 థియేటర్లకుపైగా విడుదల చేశారు. లవ్ అండ్ రొమాంటిక్, ఫన్ అండ్ ఎమోషనల్ గా సాగే ఈ చిత్రాన్ని నైజాంలో 150కిపైగా, సీడెడ్‌లో 60కి పైగా, ఆంధ్రాలో 180కి పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు.

    4వ రోజు వచ్చిన కలెక్షన్స్..

    4వ రోజు వచ్చిన కలెక్షన్స్..

    కేరళ కుట్టి ఇవానా షాజీ హీరోయిన్ గా ఆకట్టుకున్న లవ్ టుడే చిత్రం తెలుగులోనూ మంచి వసూళ్లతో ప్రారంభమైంది. లవ్ టుడే చిత్రం 3వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఏరియాలు కలుపుకుని రూ. 2.38 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా.. 4వ రోజు రూ. 1.15 కోట్ల గ్రాస్ రాబట్టింది. అంటే మిగతా రోజులతో పోల్చుకుంటే నాలుగో రోజు కలెక్షన్స్ సగం తగ్గాయి. ఇందుకు సోమవారం కావడమే కారణంగా తెలుస్తోంది.

    4 రోజుల్లో సాధించిన వసూళ్లు..

    4 రోజుల్లో సాధించిన వసూళ్లు..

    లవ్ అండ్ ఫ్రస్టేషన్, స్మార్ట్ ఫోన్ లో సీక్రెట్స్ అంటూ యూత్ కు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఎంచుకున్న డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ దాన్ని అందరికీ అర్థమయ్యేలా తెరకెక్కించి విజయం సాధించారు. దీంతో ఈ చిత్రానికి మంచి పాజిటివ్ టాక్ అందుతోంది. ఫలితంగా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో లవ్ టుడే సినిమాకు 4 రోజుల్లో నైజాంలో రూ. 3.70 కోట్లు, సీడెడ్ లో రూ. 86 లక్షలు, ఆంధ్రాలో రూ. 3.54 కోట్లతో కలిపి రూ. 8.10 కోట్ల గ్రాస్, రూ. 4.19 కోట్ల షేర్ వసూలైంది.

    వచ్చిన లాభం ఎంతంటే..

    వచ్చిన లాభం ఎంతంటే..

    క్రేజీ కాన్సెప్ట్ తో వచ్చిన కోలీవుడ్ మూవీ లవ్ టుడేకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.7 థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3 కోట్లుగా నమోదైంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల్లో రూ. 4.19 షేర్ వసూలు చేసింది. అంటే లవ్ టుడే చిత్రం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడమే కాకుండా ప్రస్తుతం రూ. 1.19 కోట్ల లాభాన్ని దక్కించుకుంది. దీంతో ఈ సినిమా హిట్ నుంచి సూపర్ హిట్ గా నిలిచింది.

    English summary
    Tamil Dubbed Movie Love Today Telugu Version 4 Days Box Office Collection Is Rs. 4.19 Cr.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X