Dragon Day 20 Collections : ‘డ్రాగన్’ 20వ రోజు కలెక్షన్లు.. ఎన్ని కోట్లు కలెక్ట్ అయ్యిందంటే?

యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ఫిబ్రవరి 14న తమిళంతోపాటు తెలుగులోనూ గ్రాండ్ గా విడుదలైంది. గతంలో 'లవ్ టుడే'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రదీప్ రంగనాథన్ తాజాగా ఈ కమింగ్ అప్ ఏజ్ కామెడీ డ్రామాతో ఆడియెన్స్ కు మరోస్టైల్ లో ఎంటర్ టైన్ మెంట్ ను పంచారు. కాగా ఈచిత్రం థియేట్రికల్ రన్ మొదటిరోజు నుంచి ఇప్పటి వరకు విజయవంతంగా కొనసాగుతోంది.

ప్రస్తుతం థర్డ్ వీక్ లో 'డ్రాగన్' మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు ఆసక్తికరంగా మారాయి. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. డే1న రూ.6.5 కోట్ల నెట్, డే2న రూ.10.8 కోట్లు నెట్, డే3న రూ.12.75 కోట్లు నెట్, డే4న రూ.5.8 కోట్లు నెట్, డే5న రూ.5.1 కోట్లు నెట్, డే6న రూ.5.2 కోట్లు నెట్, డే7న రూ.4.5 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇక రెండో వారంలో డే8న రూ.4.7 కోట్ల నెట్, డే9న రూ.8.5 కోట్ల నెట్, డే10న రూ.9కోట్ల నెట్, డే11న రూ.2.25 కోట్లు నెట్, డే12న 2.25 కోట్ల నెట్, డే13న రూ.2.3 కోట్ల నెట్, డే14న రూ.2.15 కోట్ల నెట్ అందుకుంది. సెకండ్ వీక్ మొత్తంగా రూ.31.9 కోట్ల వరకు ఇండియా నెట్ వసూల్ చేసింది.

Dragon Day 20 Collections

అయితే రెండో వారం అయ్యేలోపే ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోవడం విశేషం. కాగా, మూడో వారంలోనూ తమిళంలో, తెలుగులో జోరుగా వసూళ్లు సాధిస్తోందీ 'డ్రాగన్' మూవీ. ఇక థర్డ్ వీక్ లో డే15న రూ.2.05 కోట్ల నెట్, డే16న రూ.3.65 కోట్ల నెట్, డే17న రూ.3 కోట్లకు పైగా ఇండియాలో నెట్ అందుకుంది. కాగా డే18న రూ.1.15 కోట్ల నెట్ అందుకుంది. డే19న రూ.1.05 కోట్ల వరకు నెట్ కలెక్షన్లు వసూలైంది. డే20న తమిళం, తెలుగులో కలిపి రూ.81 లక్షల నెట్ వసూల్ చేసింది. దీంతో ఇండియా నెట్ రూ.94.01 కోట్లకు చేరుకుంది.

ఇక డే20 వరకు డ్రాగన్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.140.00 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. కేవలం రూ.35 కోట్ల బడ్జెట్ లో నిర్మితమైన ఈ చిత్రం మూడురెట్ల వసూళ్లను సాధించింది. ఇక ఇండియా నెట్ రూ.94.01 కోట్లు కాగా, గ్రాస్ రూ.107.7 కోట్ల వరకు వసూల్ చేసింది. ఓవర్సీస్ కలెక్షన్లు రూ.32.3 కోట్లు నమోదైంది. డే20 వరకు తమిళంలో రూ.76.41 కోట్ల నెట్, తెలుగులో రూ.17.6 కోట్ల నెట్ అందుకుంది. కేవలం డే20వ రోజు మాత్రం తమిళంలో రూ.66 లక్షల నెట్, తెలుగులో రూ.15 లక్షల నెట్ అందుకుంది.

Take a Poll

ఇక థర్డ్ వీక్ పూర్తయ్యే లోపే ఈ చిత్రం రూ.140 కోట్ల గ్రాస్ ను చేరుకోవడం విశేషం. ఇక ఫోర్త్ వీక్ లో రూ.150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందా? లేదా?అన్నది ఆసక్తికరంగా మారింది. కానీ మున్ముందు వచ్చే కొత్త సినిమాల ప్రభావంతో 'డ్రాగన్' వసూళ్లు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి. ప్రస్తుతం వసూళ్లు మాత్రం భారీగానే తగ్గాయి. లక్షల్లోనే వసూళ్లు అందుతున్నాయి. మరోవైపు ఈచిత్రం త్వరలో హిందీ వెర్షన్ లోనూ విడుదలై నార్త్ లో సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది. ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి అశ్వత్ మారిముత్తు దర్శకుడు. కయాదు లోహర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు గా అలరించారు.

More from Filmibeat

Read more about: pradeep ranganathan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X