Dragon Day 3 Collections : ‘డ్రాగన్’ 3వ రోజు కలెక్షన్లు... బాక్సాఫీస్ సునామీగా మారిన ప్రదీప్ రంగనాథన్..!
తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైన సంగతి తెలిసిందే. నటుడిగా తన తొలిచిత్రం 'లవ్ టుడే'తోపాటు తమిళంతో పాటు ఇటు తెలుగు ఆడియెన్స్ లోనూ మంచి మార్కులు కొట్టేశాడు. నటుడిగా క్రేజ్ దక్కించుకున్నాడు. ఇక ప్రస్తుతం 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' చిత్రంతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఫిబ్రవరి 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.
ఈ సినిమాను గ్రాండ్‌గా సుమారుగా ఇండియాలో 1000 స్క్రీన్లు, వరల్డ్ వైడ్‌గా 1500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాను తమిళంలో ఏజీఎస్ సొంతంగా రిలీజ్ చేసుకోగా.. తెలుగులో ఏషియన్ సురేష్ డిస్టిబ్యూటర్స్ విడుదల చేశారు. కాగా ఈ చిత్రం మొదటి రోజే ఇండియాలో రూ.6.5 కోట్ల నెట్ ను వసూల్ చేసి ఆశ్చర్యపరిచింది. తమిళంలో రూ.5.4 కోట్లు, తెలుగులో రూ.1.1 కోట్ల నెట్ వసూల్ చేసింది.

ఇక రెండో రోజు ఇండియాలో రూ.10.8 కోట్ల నెట్ వసూల్ చేసి ఆశ్చర్య పరిచింది. తమిళంలో రూ.9.05 కోట్లు వసూళ్లు కాగా.. తెలుగులోనూ రెండో రోజు రూ.1.75 కోట్లు వసూళ్లు రాబట్టింది. మొదటిరోజుతో పోల్చితే రెండో రోజు 66.15 శాతం వసూళ్లు పెరిగాయి. ఇక మూడో రోజు వసూళ్ల విషయానికొస్తే.. రూ.11.50 కోట్ల నెట్ వసూల్ చేసింది. కేవలం ఇండియాలోనే తెలుగు, తమిళం రేంజ్ లో ఈ వసూళ్లు సాధించింది. అంటే రూ.18 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసిందని తెలుస్తోంది.
దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల గ్రాస్ మార్క్ దాటిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజు రూ.5.5 కోట్లు, రెండో రోజు 9 కోట్ల వరకు కలెక్షన్లు కేవలం తమిళంలోనే రాబట్టింది. మొదటి వీకెండ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పటి వరకు ఇండియాలో మొత్తంగా రూ.28.80 కోట్ల నెట్ వసూల్ చేసింది.
తమిళ్ లో 75 శాతానికి పైగా ఆక్యుపెన్సీ సాధించింది. అత్యధికంగా ఈ చిత్రానికి చెన్నై, కోయంబత్తూర్ లో కలెక్షన్లు భారీగా అందుతున్నాయి. ఈ చిత్రం ఇలాగే వసూళ్లు రాబడితే త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరుతుందని అంచనా వేస్తున్నారు.

ఇక బీటెక్ పూర్తి చేసి బ్యాక్ డోర్ లో ఉద్యోగం కోసం ప్రయత్నించి.. రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశం పొంది.. ఒక ట్విస్ట్ తో గందరగోళ పరిస్థితిలో పడ్డ యువకుడి కథనే 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'. చిత్రానికి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ప్రశంసలు అందాయి.
డ్రాగన్ చిత్రానికి అశ్వత్ మారుముత్తు దర్శకత్వం వహించారు. ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కళాపతి నిర్మాతలు రూపొందించారు. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్, కాయడు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ దర్శకులు కేఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్‌తోపాటు స్నేహ అతిథి పాత్రలో కనిపించారు. జార్జ్ మార్యన్, ఇందుమతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి నిమాటోగ్రఫి నికేత్ బొమ్మిరెడ్డి, ఎడిటింగ్ ప్రదీప్ ఈ రాఘవ్, మ్యూజిక్ లియోన్ జేమ్స్ అందించారు. 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు.


Click it and Unblock the Notifications











