Dragon Day 4 Collections : ‘డ్రాగన్’ 4వ రోజు కలెక్షన్లు.. ప్రదీప్ రంగనాథన్ సంచలనం.. ఎన్ని కోట్లో తెలుసా?

'లవ్ టుడే' హీరో, తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా దగ్గరైన సంగతి తెలిసిందే. మరో ధనుష్ లా తన నటనతో అందరినీ ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఈయన ఇప్పటి వరకు హీరోగా రెండు సినిమాల్లో మాత్రమే నటించారు. 2022లో 'లవ్ టుడే' చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఫిబ్రవరి 21న 'డ్రాగన్' చిత్రంతో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రదీప్ రంగనాథన్.

తెలుగులో ఈ చిత్రం 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'గా విడుదలైంది. ఈ సినిమాను ఇండియాలో సుమారుగా 1000 స్క్రీన్లు, వరల్డ్ వైడ్‌గా 1500 స్క్రీన్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమాను తమిళంలో ఏజీఎస్ సొంతంగా రిలీజ్ చేసుకోగా.. తెలుగులో ఏషియన్ సురేష్ డిస్టిబ్యూటర్స్ విడుదల చేశారు. ఇక మొదటి రోజే ఈ చిత్రం ఇండియాలో రూ.6.5 కోట్ల నెట్ ను వసూల్ చేసి ఆశ్చర్యపరిచింది. తమిళంలో రూ.5.4 కోట్లు, తెలుగులో రూ.1.1 కోట్ల నెట్ వసూల్ చేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల హవా కొనసాగుతూనే ఉంది.

Pradeep Ranganathans Dragon Movie Day 4 Box Office Collections Worldwide

మొదటి రోజే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 12.35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇండియాలో రూ.6.50 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇండియా గ్రాస్ రూ.7.60 కోట్లు రాబట్టింది. మరోవైపు ఓవర్సీస్ లోనూ రూ.4.75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక రెండో రోజు వరల్డ్ వైగ్ గా రెండు రోజులకు కలిసి రూ.28 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఆశ్చర్య పరిచింది. ఇండియా నెట్ రూ.17.3 కోట్లు కావడం విశేషం. ఇండియా గ్రాస్ రూ.20 కోట్లు వసూలైంది. రెండో రోజు కూడా ఓవర్సీస్ లో రూ.8 కోట్లు వసూల్ చేసింది. ఇక మూడో రోజు బాక్సాఫీస్ వద్ద అదరొట్టింది.

మూడు రోజుల్లో మొత్తంగా వరల్ల్ వైడ్ రూ.49.50కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కేవలం ఇండియాలోనే మూడురోజులకు కలిసి రూ.34.80 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. మూడో రోజు మాత్రమే ఇండియాలో రూ.12.75 కోట్ల నెట్ ను వసూల్ చేసింది. తమిళంలో రూ.10.9 కోట్లు, తెలుగులో రూ.1.85 కోట్లు వసూలైంది. కాగా నాలుగో రోజు సోమవారం వర్కింగ్ డే అయినా కూడా రూ.5.50 కోట్ల మేర నెట్ వసూల్ చేసింది. నాలుగో రోజు కలెక్షన్లు కలుపుకొని 'డ్రాగన్' రూ.50 కోట్ల క్లబ్ లో చేరడమే కాకుండా.. రూ.100 కోట్లవైపు పరుగులు తీస్తుందని తెలుస్తోంది. ఇక నాలుగు రోజుల మొత్తంగా ఇండియా నెట్ కలెక్షన్లు రూ.35.55 కోట్లు వచ్చాయి.

ఫిబ్రవరి 24, సోమవారం వర్కింగ్ డేలోనూ 'డ్రాగన్' చిత్రం ఓవరాల్ గా 40 శాతం ఆక్యుపెన్సీని సాధించింది. మొదటి రెండు ఆటలకు 25 నుంచి 38 శాతం వరకు ఆక్యుపెన్సీ రికార్డు అయ్యింది. నైట్ షోకు మాత్రం ఏకంగా 50 శాతం ఆక్యుపెన్సీని కలిగింది. ఇలా వర్కింగ్ డేస్ లోనూ ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్' ప్రేక్షకులను ఆకర్షిస్తుండటం సంచలనంగా మారింది.

గతంలో 'లవ్ టుడే' చిత్రం రూ.5 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకోని రూ.100కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసింది. ఇప్పుడు 'డ్రాగన్' కూడా అదే పథంలో నడుస్తోంది. కేవలం నాలుగు రోజుల్లో రూ.55 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక డ్రాగన్ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అశ్వత్ మారుముత్తు డైరెక్ట్ చేశారు. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్, కాయడు లోహర్ హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ దర్శకులు కేఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్‌తోపాటు స్నేహ అతిథి పాత్రలో కనిపించారు. 40 కోట్ల రూపాయల బడ్జెట్‌ తో నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X