Dragon Day 5 Collections : ‘డ్రాగన్’ 5వ రోజు కలెక్షన్లు... ఫుల్ జోష్ లో ప్రదీప్ రంగనాథన్.. ఎంత వసూలైందంటే?
యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ - అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహర్ జంటగా నటించిన చిత్రం 'డ్రాగన్'. ప్రదీప్ గతంలో 'లవ్ టుడే' చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైన సంగతి తెలిసిందే. తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈయన ఇప్పటి వరకు హీరోగా రెండు సినిమాల్లో మాత్రమే నటించారు. 2022లో 'లవ్ టుడే' చిత్రం విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఫిబ్రవరి 21న 'డ్రాగన్'తో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రదీప్ రంగనాథన్. తెలుగులో ఈ చిత్రం 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'గా విడుదలైంది.
ఈ చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికొస్తే.. ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు గట్టిగానే వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజే ఈ చిత్రం ఇండియాలో రూ.6.5 కోట్ల నెట్ ను వసూల్ చేసి ఆశ్చర్యపరిచింది. తమిళంలో రూ.5.4 కోట్లు, తెలుగులో రూ.1.1 కోట్ల నెట్ వసూల్ చేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల హవా కొనసాగుతూనే ఉంది. మొదటి రోజే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 12.35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇండియాలో రూ.6.50 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇండియా గ్రాస్ రూ.7.60 కోట్లు రాబట్టింది. మరోవైపు ఓవర్సీస్ లోనూ రూ.4.75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

ఇక రెండో రోజు వరల్డ్ వైగ్ గా రెండు రోజులకు కలిసి రూ.28 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఆశ్చర్య పరిచింది. ఇండియా నెట్ రూ.17.3 కోట్లు కావడం విశేషం. ఇండియా గ్రాస్ రూ.20 కోట్లు వసూలైంది. రెండో రోజు కూడా ఓవర్సీస్ లో రూ.8 కోట్లు వసూల్ చేసింది. మూడు రోజుల్లో మొత్తంగా వరల్డ్ వైడ్ రూ.49.50కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కేవలం ఇండియాలోనే మూడురోజులకు కలిసి రూ.34.80 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. మూడో రోజు మాత్రమే ఇండియాలో రూ.12.75 కోట్ల నెట్ ను వసూల్ చేసింది. తమిళంలో రూ.10.9 కోట్లు, తెలుగులో రూ.1.85 కోట్లు వసూలైంది.
నాలుగో రోజు సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ రూ.5.70 కోట్ల మేర నెట్ వసూల్ చేసింది. ఇక ఐదో రోజూ కూడా వసూళ్లు భారీగానే అందాయి. డే5 రూ.4.75 కోట్ల మేర నెట్ వసూల్ చేసింది. వీటికి మరిన్ని వసూళ్లు యాడ్ కావాల్సి ఉంది. అవి కలుపుకుంటే.. ఐదోరోజున రూ.5 కోట్ల వరకు నెట్ వచ్చి ఉంటుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐదోరోజు తమిళంలో రూ.3.66 కోట్ల నెట్, తెలుగులో రూ.1.1 కోట్ల నెట్ వసూలైంది. ఇక ఈ చిత్రం నాలుగురోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.57.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కేవలం ఇండియాలోనే రూ.35.75 కోట్ల నెట్ రాబట్టింది. నాలుగు రోజుల్లో రూ.41.35 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది.

టాక్ బాగుండటంతో రెండో వీకెండ్ గట్టిగానే వసూళ్లు రాబట్టనుందని తెలుస్తోంది. ఇప్పటికే రూ.57కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసిన ఈ చిత్రం త్వరలోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక 'డ్రాగన్' చిత్రం ఓవరాల్ గా 30 శాతం ఆక్యుపెన్సీని సాధిస్తోంది. ఈ చిత్రం సుమారుగా 1000 స్క్రీన్లు, వరల్డ్ వైడ్‌గా 1500 స్క్రీన్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. తమిళంలో ఏజీఎస్ సొంతంగా రిలీజ్ చేసుకోగా.. తెలుగులో ఏషియన్ సురేష్ డిస్టిబ్యూటర్స్ విడుదల చేశారు. అశ్వత్ మారుముత్తు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లు. ప్రముఖ దర్శకులు కేఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్‌తోపాటు స్నేహ అతిథి పాత్రలో కనిపించారు. రూ. 40 కోట్లతో చిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











