Dragon Day 5 Collections: ‘డ్రాగన్’ 6వ రోజు కలెక్షన్లు..మహాశివరాత్రి వేళ ప్రదీప్ రంగనాథన్ వసూళ్ల జోరు, ఎంతంటే?

'లవ్ టుడే' హీరో, కోలీవుడ్ సెన్సేషనల్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ - అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహర్ జంటగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'డ్రాగన్'. ప్రదీప్ గతంలో 'లవ్ టుడే'తో తమిళంలోనే కాకుండా, తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యారు. తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. 2022లో విడుదలైన 'లవ్ టుడే' చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. రూ.100 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఇక తాజాగా ఫిబ్రవరి 21న 'డ్రాగన్'తో మళ్లీ థియేటర్లలో సందడి చేస్తున్నారు ప్రదీప్ రంగనాథన్. తెలుగులో 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'గా విడుదలైందీ చిత్రం.

'డ్రాగన్' చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్ల విషయానికొస్తే.. డే1 నుంచి మొదలు పెట్టి ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద గట్టిగానే వసూళ్లు చేస్తోంది. మొదటి రోజే ఈ చిత్రం ఇండియాలో రూ.6.5 కోట్ల నెట్ ను వసూల్ చేసి ఆశ్చర్యపరిచింది. తమిళంలో రూ.5.4 కోట్లు, తెలుగులో రూ.1.1 కోట్ల నెట్ వసూల్ చేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల హవా కొనసాగుతూనే ఉంది. మొదటి రోజే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 12.35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఫస్ట్ డే ఇండియా గ్రాస్ రూ.7.60 కోట్లు రాబట్టింది. మరోవైపు ఓవర్సీస్ లోనూ రూ.4.75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

Pradeep Ranganathans Dragon Movie Day 6 Box Office Collections Worldwide

రెండో రోజు రెండు రోజులకు కలిసి వరల్డ్ వైడ్ గా రూ.28 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఆశ్చర్య పరిచింది. ఇండియా నెట్ రూ.17.3 కోట్లు కావడం విశేషం. ఇండియా గ్రాస్ రూ.20 కోట్ల వరకు వసూల్ అయ్యింది. రెండో రోజు కూడా ఓవర్సీస్ లో రూ.8 కోట్లు వసూల్ చేసింది. ఇక మూడు రోజుల్లో మొత్తంగా వరల్డ్ వైడ్ రూ.49.50కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. కేవలం ఇండియాలోనే మూడురోజుల్లో రూ.34.80 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. మూడో రోజు మాత్రమే ఇండియాలో రూ.12.75 కోట్ల నెట్ ను వసూల్ చేసింది. తమిళంలో రూ.10.9 కోట్లు, తెలుగులో రూ.1.85 కోట్లు వసూలైంది.

ఇక నాలుగో రోజు సోమవారం వర్కింగ్ డే అయినా కూడా రూ.5.80 కోట్ల వరకు నెట్ వసూల్ చేసింది. ఐదో రోజూ భారీగానే వసూళ్లు అందాయి. రూ.5.1 కోట్ల నెట్ ను రాబట్టింది. ఇందులో తమిళంలో రూ.4 కోట్ల నెట్, తెలుగులో రూ.1.1 కోట్ల నెట్ వసూలైంది. నాలుగో రోజుతో పోల్చితే స్వల్పంగా 12 శాతం మేర వసూళ్లు తగ్గాయి. ఆరో రోజు వసూళ్లు కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. మహాశివరాత్రి వేళ కూడా ప్రేక్షకులు 'డ్రాగన్' చిత్రాన్ని ఆదరిస్తున్నారు. సెలవు వేళ కావడంతో మంచి మౌత్ టాక్ సంపాదించుకున్నఈ చిత్రానికి మొగ్గుచూపారు. దీంతో డే6న రూ.4.75 కోట్ల నెట్ వసూల్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. వీటికి మరిన్ని వసూళ్లు కూడా కలవాల్సి ఉందని.. అలాగైతే రూ.5 కోట్ల పైనే వసూళ్లు చేసి ఉంటుందన్నారు. ఈ లెక్కన ఈ చిత్రం రూ.5కోట్లకు తగ్గకుండా వసూళ్లు రాబడుతుంటం విశేషం.

ఐదు రోజుల వరకు ఇండియా నెట్ రూ.40.95 కోట్లు వసూలైంది. ఇండియా గ్రాస్ రూ.47.40 కోట్లు రాగా, వరల్డ్ వైడ్ గా రూ.64.50 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇప్పటి వరకు తెలుగు స్టేట్స్ లో రూ.7.05 కోట్లు సంపాదించింది. ఈ 'డ్రాగన్' చిత్రాన్ని అశ్వత్ మారుముత్తు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లు. ప్రముఖ దర్శకులు కేఎస్ రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్‌తోపాటు స్నేహ అతిథి పాత్రలో కనిపించారు. రూ. 40 కోట్లతో చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ సుమారుగా 1000 స్క్రీన్లు, వరల్డ్ వైడ్‌గా 1500 స్క్రీన్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. తమిళంలో ఏజీఎస్ సొంతంగా రిలీజ్ చేసుకోగా.. తెలుగులో ఏషియన్ సురేష్ డిస్టిబ్యూటర్స్ విడుదల చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X