Dragon Day 7 Collections : ‘డ్రాగన్’ 7వ రోజు కలెక్షన్లు.. ప్రదీప్ వసూళ్ల జాతర.. ఫస్ట్ వీక్ పూర్తి వివరాలు!

ప్రదీప్ రంగనాథన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జాతర కొనసాగిస్తున్నారు. లవ్ టుడే.. హీరోకు తమిళంలో పాటు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కుతుండటం విశేషం. రీసెంట్ గా ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తమిళంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తెలుగులో 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' గా థియేటర్లలోకి వచ్చింది. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా వసూళ్లు రాబడుతోంది. 'డాగన్' వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి...

నేటితో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీక్ ను పూర్తి చేసుకుంది. దీంతో 'డ్రాగన్' చిత్రానికి వస్తున్న కలెక్షన్లు ఆసక్తి కరంగా మారాయి. ఇప్పటికే రూ.50 కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ చిత్రం రోజురోజుకు జోరుగా వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటికే ఇండియాలో రూ.50.15 కోట్ల వరకు నెట్ ను వసూల్ చేయడం విశేషంగా మారింది. నేటితో ఈ చిత్రం ఫస్ట్ వీక్ ను పూర్తి చేసుకోగా.. డే7న డ్రాగన్ రూ.4 కోట్లకు పైగా నెట్ వసూల్ చేసింది. ముందు రోజుతో పోల్చితే ఈ వసూళ్లు కాస్తా తగ్గాయనే చెప్పాలి.

Pradeep Ranganathans Dragon Movie Day 7 Box Office Collections Worldwide

ఇక వారం రోజుల్లో ఈ చిత్రం పూర్తి వసూళ్ల వివరాలకు వస్తే.. కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.71.40 కోట్లు సంపాదించింది. ఇండియాలో డే6 వరకు రూ.46.15 కోట్లు అందుకుంది. ఓవర్సీస్ లో రూ.18 కోట్లు కలెక్షన్స్ చేసింది. అలాగే ఇండియాలో రూ.53.40 కోట్ల గ్రాస్ ను అందుకుని ఆశ్చర్య పరిచింది. వీటన్నింటికి మళ్లీ ఏడో రోజుకు సంబంధించిన పూర్తి లెక్కులు కూడా యాడ్ కావాల్సి ఉంది. ఇవన్నీ కలుపుకొని మొత్తం డే7 వరకు వరల్డ్ వైడ్ గా రూ.76 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసి ఉంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

వారం రోజుల కలెక్షన్ల వివరాల్లో రోజువారీగా ఈ చిత్రం ఎంత వసూల్ చేసిందో చూస్తే.. డే1న రూ.6.5 కోట్ల వరకు ఇండియాలో నెట్ వసూల్ చేసింది. తమిళంలో రూ.5.4 కోట్లు, తెలుగులో రూ.1.1 కోట్లు కలెక్ట్ చేసింది. డే2న రూ.10.8 కోట్లు.. తెమిళంలో రూ.8.9 కోట్లు, తెలుగులో రూ.1.9 కోట్ల నెట్ వసూల్ చేసింది. డే3న రూ.12.75 కోట్లు.. తెలుగులో రూ.10.9కోట్లు, తెలుగులో రూ.1.85 కోట్ల నెట్ రాబట్టింది. డే4న రూ.5.8 కోట్లు.. తమిళంలో రూ.4.7 కోట్లు, తెలుగులో రూ.1.1 కోట్ల నెట్ అందుకుంది.

డే5న రూ.5.1 కోట్లు.. తమిళంలో రూ.4 కోట్లు, తెలుగులో రూ.1.1 కోట్లు వసూల్ చేసింది. డే6న రూ.5.2 కోట్లు.. తమిళంలో రూ.3.7 కోట్లు, తెలుగులో రూ.1.5 కోట్లు సంపాదించింది. ఇక ఏడో రోజు రూ.4 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఇలా మొత్తంగా ఇండియాలో రూ.50 కోట్లకు పైగానే నెట్ వసూల్ చేసింది. ఇక ఈ చిత్రంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వర్, కయాదు లోహర్ ఫీమేల్ లీడ్స్ లో నటించారు. చిత్రాన్ని తమిళంలో ఏజీఎస్ సొంతంగా రిలీజ్ చేసుకోగా.. తెలుగులో ఏషియన్ సురేష్ డిస్టిబ్యూటర్స్ విడుదల చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X