Dragon Day 8 Collections : ‘డ్రాగన్’ 8వ రోజు టోటల్ కలెక్షన్లు.. తెలుగులోనే ఇన్ని కోట్లా? ప్రదీప్ రంగనాథన్ హవా!
తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జాతర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల కింద లవ్ టుడే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన తొలి చిత్రంతోనే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు. జూనియర్ ధనుష్ లా మెరిసి ఆడియెన్స్ ను తనవైపు తిప్పుకున్నారు. ప్రస్తుతం తన టాలెంట్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నాడు. ఈ యంగ్ హీరోకు తమిళంలో పాటు తెలుగులోనూ మంచి ఆదరణ దక్కుతుండటం విశేషం. ఇక రీసెంట్ గా ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్' ఫిల్మ్ థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే.
తమిళంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' గా తెలుగు వెర్షన్ లో విడుదలైంది. ఫిబ్రవరి 21న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. నేటితో ఈ మూవీ రిలీజ్ అయ్యి తొమ్మిది రోజులు అవుతోంది. ఇక ఫిబ్రవరి 28న ఈ చిత్రం డే8ను పూర్తి చేసుకుంది. ఎనిమిదో రోజు ఈ చిత్రానికి ఎంత కలెక్షన్లు వచ్చాయో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. తమిళ హీరో అయినప్పటికీ తెలుగులో మంచి పట్టును సాధిస్తున్నారు. వరల్డ్ వైడ్ గానూ గట్టిగానే వసూళ్లు రాబడుతున్నాడు ప్రదీప్ రంగనాథన్. ఇప్పటికే రూ.50 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం డే8న కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

'డ్రాగన్' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ వీక్ ను పూర్తి చేసుకుంది. డే7న డ్రాగన్ రూ.4 కోట్లకు పైగా నెట్ వసూల్ చేసింది. అందులో తమిళంలో నరూ.3.1 కోట్లు కాగా.. తెలుగులోనే రూ.0.9 కోట్లు వసూళ్లు సాదించింది. ఇక డే8న కూడా రూ.4 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి ఆశ్చర్య పరిచింది. వర్క్ డేస్ లో ఇంతలా వసూళ్లు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. మొదటి వారం పూర్తి చేసుకున్నా... వర్కింగ్ డేస్ అయినప్పటికీ ఇంతలా వసూళ్లు చేస్తుండటం పట్ల ట్రేడ్ నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ కు షాక్ అవుతున్నారు.
మొదటి వారం పూర్తయ్యే సరికి ఈ చిత్రం.. వరల్డ్ వైడ్ గా రూ.77.50 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఇక ఇండియాలో రూ.5015 కోట్ల నెట్, రూ.58 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో రూ.19.50 కోట్ల గ్రాస్ అందుకుంది. కేవలం వారంలో రోజుల్లోనే రూ.70 కోట్లకు పైగా వసూళ్లు సాధించడమంటే ప్రదీప్ రంగనాథన్ రోజుకు రూ.10 కోట్ల వరకు వసూళ్లు సాధిస్తున్నాడని అర్థం. ఇవి ఒక స్టార్ హీరోకు మాత్రమే సాధ్యమయ్యే వసూళ్లు కావడంతో ట్రేడ్ పండితులు నివ్వెర పోతున్నారు.
శుక్రవారం ఆక్యుపెన్సీ ప్రతి షోకు 25 నుంచి 30 శాతం వరకు నమోదైంది. వీక్ డేస్ లో మాత్రం 50 నుంచి 70 మధ్యన ఉంటోంది. దీంతో ప్రదీప్ రంగనాథన్ చిత్రానికి మున్ముందు ఏ రేంజ్ లో వసూళ్లు వస్తాయో చూడాలి. ఏదేమైనా ఈ వీకెండ్ పూర్తయ్యే సరికి 'డ్రాగన్' చిత్రం రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రదీప్ కూడా బాక్సాఫీస్ వద్ద అదే స్థాయిలో వసూళ్లు రాబడుతున్నారు.
డే8 వరకు తమిళంలో రూ.43.95 కోట్ల నెట్ వసూల్ చేసింది. కేవలం తెలుగు స్టేట్స్ లోనే రూ.10.21 కోట్ల నెట్ రాబట్టి ఆశ్చర్యపరిచింది. అంటే రోజుకు రూ.1కోటికి పైగానే వసూళ్లు చేసుకుంటున్నాడు ప్రదీప్ రంగనాథన్. ఇక సెకండ్ వీక్ ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహార్ నటించారు. ఏజీఎస్ తమిళంలో సొంతంగా రిలీజ్ చేసుకోగా.. తెలుగులో ఏషియన్ సురేష్ డిస్టిబ్యూటర్స్ విడుదల చేశారు.


Click it and Unblock the Notifications











