చిరు పొలిటికల్ ఎఫెక్ట్ చిరుతపై?

యస్.యస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న 'మగధీర" విడుదలైన వెంటనే, రామ్ చరణ్ తో మళ్లీ తమ స్వంత సంస్థ అంజనా ప్రొడక్షన్ ద్వారా మూడవ చిత్రం రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి హేరిస్ జైరాజ్ సంగీతాన్నందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ అధిక శాతం అమెరికాలో జరుపుకోనుంది. తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన హీరోయిన్‌గా జెనీలియా ఎంపికైంది. ఇక ఈ చిత్రం తర్వాతి చిత్రం మళ్లీ గీతా ఆర్ట్‌సలోనే నిర్మాణం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ నటించే అయిదో చిత్రానికి శ్రీను వైట్లను దర్శకుడిగా ఇప్పటికే ఎంపిక చేసారని, బ్యానర్‌ను త్వరలోనే నిర్ణయి స్తారని సమాచారం అందు తోంది. దీని తర్వాత చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ స్వయంగా నిర్మించను న్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











