Prasanna Vadanam Business: ప్రసన్న వదనం మూవీకి భారీ బిజినెస్.. అన్ని కోట్లతో సుహాస్ రికార్డు
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మందే యంగ్ హీరోలు ఉన్నా.. అందులో కొందరు కుర్రాళ్లు మాత్రమే విభిన్నమైన సినిమాలు చేస్తూ.. విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ గాయ్ సుహాస్ ఒకడు.
హీరోగా మారిన వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతోన్న అతడు.. రెట్టించిన ఉత్సాహంతో ప్రయోగాత్మక చిత్రాలను చేస్తున్నాడు. ఇలా ఇప్పుడు సుహాస్ 'ప్రసన్న వదనం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్‌ను ఎంత వరకూ చేసిందో మీరే చూసేయండి మరి!

ప్రసన్న వదనం అంటూ కొత్తగా
సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీనే 'ప్రసన్న వదనం'. అరుణ్ వైకే ఈ మూవీని మణికంట జేఎస్, ప్రసాద్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించారు. ఇందులో రాశీ సింగ్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌లుగా చేశారు. అలాగే, ఈ సినిమాలో నితిన్ ప్రసన్న, కుశాలిని, సాయి శ్వేత, సత్య, వైవా హర్షలు కీలక పాత్రలను పోషించారు.
విభిన్నమైన సమస్యతో హైలైట్
టాలెంటెడ్ గాయ్ సుహాస్ నటించిన 'ప్రసన్న వదనం' మూవీ కలర్ బ్లైండ్‌నెస్ అనే కాన్సెప్టుతో రూపొందింది. ఇందులో హీరోకు ఎదుటి వాళ్లు ముఖాలను గుర్తు పట్టలేని సమస్య ఉంటుంది. దీనివల్ల అతడు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు? వాటి వల్ల ఏం కోల్పోయాడు? తిరిగి దీని నుంచి ఎలా సేవ్ అయ్యాడు? అనే అంశాలతో ఈ చిత్రాన్ని హైలైట్‌గా తెరకెక్కించారు.

ప్రమోషన్స్‌తో మరింత చేరువ
సుహాస్ హీరోగా చేసిన 'ప్రసన్న వదనం' మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచేసింది. ఇప్పటికే చాలా ఈవెంట్లు కూడా నిర్వహించింది. అలాగే, ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలు చేసుకున్నారు. శుక్రవారమే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తుండడంతో ఈ మూవీ హడావిడి బాగా కనిపిస్తోంది.
సుహాస్ మూవీకి భారీ బిజినెస్
క్రేజీ కాన్సెప్టుతో రాబోతున్న 'ప్రసన్న వదనం' మూవీపై సినీ అభిమానులు మొత్తం బాగా ఫోకస్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలను కలుపుకుని మొత్తంగా ఈ సినిమాకు రూ. 2.50 కోట్లు, ఓవరాల్‌గా రూ. 3.00 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ సమాచారం.

రికార్డు బిజినెస్.. టార్గెట్ ఇలా
సుహాస్ నటించిన 'ప్రసన్న వదనం' సినిమాకు అతడి కెరీర్‌లోనే అత్యధికంగా రూ. 3.00 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో ఈ సినిమాకు రూ. 3.20 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదైంది. అంటే.. ఇంత మొత్తం వసూలు చేస్తేనే ఈ సినిమా విజయం సాధిస్తుంది. వరుస హిట్లతో దూసుకుపోతోన్న సుహాస్ అదే ఊపును కొనసాగిస్తే హ్యాట్రిక్‌ను నమోదు చేసే ఛాన్స్ ఉంటుంది.


Click it and Unblock the Notifications











