HanuMan Day 1 Collections: హనుమాన్ విధ్వంసం.. ఫస్ట్ డేనే అన్ని కోట్లు.. హిందీలో వచ్చింది ఎంతంటే!

సాధారణంగా ఏ భాషలోనైనా సినిమాలు విడుదల అవుతుంటాయి. కానీ, ఏమాత్రం అంచనాలు లేకుండానే రూపొందినా.. కొన్ని మాత్రం రిలీజ్‌కు ముందే సెన్సేషన్ అవుతుంటాయి. అలాంటి వాటిలో 'హనుమాన్' ఒకటి. సూపర్ హీరో స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దీంతో భారీ హైప్‌ను క్రియేట్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి మొదటి రోజు భారీ స్పందన లభించడంతో వసూళ్లు కూడా అత్యధికంగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో 'హనుమాన్' మూవీ తొలి రోజు ఎంత రాబట్టిందో మీరే చూసేయండి మరి!

హనుమాన్‌ తేజ వచ్చేశాడు
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శత్వంలో వచ్చిన సూపర్ హీరో మూవీనే 'హనుమాన్'. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్ డైరెక్టర్లుగా చేశారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు.

 Prasanth Varma and Teja Sajja Hanu Man Movie Day 1 Worldwide Collections

హనుమాన్ మూవీ బిజినెస్
'హనుమాన్' మూవీకి నైజాంలో రూ. 7.15 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.00 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు అన్నీ కలిపి రూ. 9.50 కోట్ల బిజినెస్ అయింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 20.65 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 4 కోట్లు, వేరే భాషల్లో రూ. 3 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 29.65 కోట్లు బిజినెస్ అయింది.

అలాంటి టాక్‌తో రెస్పాన్స్
విడుదలకు ముందే అదిరిపోయే హైప్‌ను క్రియేట్ చేసుకున్న 'హనుమాన్' మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన కూడా మంచిగానే లభించింది. ముఖ్యంగా ఓవర్సీస్‌తో పాటు నార్త్‌లోనూ ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి రెస్పాన్స్‌ను అందించారు.

తొలి రోజు ఎంత వచ్చింది?
'హనుమాన్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 3.66 కోట్లు, సీడెడ్‌లో రూ. 86 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 94 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 90 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 48 లక్షలు, గుంటూరులో రూ. 55 లక్షలు, కృష్ణాలో రూ. 34 లక్షలు, నెల్లూరులో రూ. 24 లక్షలతో కలిపి.. రూ. 7.97 కోట్లు షేర్, రూ. 12.35 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ నటించిన 'హనుమాన్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు రూ. 7.97 కోట్లు వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటకలో రూ. 1.10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 3.55 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ఈ చిత్రానికి రూ. 13.77 కోట్లు షేర్‌తో పాటు రూ. 24.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

 Prasanth Varma and Teja Sajja Hanu Man Movie Day 1 Worldwide Collections

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
సూపర్ మ్యాన్ స్టోరీతో రూపొందిన 'హనుమాన్' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 29.65 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 30.50 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 13.77 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 16.73 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

అక్కడ బాగా.. 11వ స్థానం
'హనుమాన్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు అనూహ్యమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా హిందీలో ఈ చిత్రం మరింత ఎక్కువ రెస్పాన్స్‌ను అందుకుంది. దీంతో అక్కడ రూ. 3.50 కోట్లు వరకూ గ్రాస్‌ను రాబట్టింది. అలాగే, రూ. 2.25 కోట్లు నెట్ వసూళ్లు (1.15 కోట్లు షేర్)ను రాబట్టింది. తద్వారా అక్కడ ఎక్కువ వసూళ్లు సాధించిన 11వ తెలుగు చిత్రంగా ఇది నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X