HanuMan Day 2 Collections: బాక్సాఫీస్ వద్ద హనుమాన్ హవా.. 2వ రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శత్వంలో తెలుగులో వచ్చిన మొదటి సూపర్ హీరో సినిమా 'హనుమాన్'. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సత్య పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్ డైరెక్టర్లుగా వ్యవహారించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి రూ.60 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...

ప్రశాంత్ వర్మ తెరక్కించిన హనుమాన్ మూవీ 2 రోజుల్లో బాగానే కలెక్ట్ చేసింది. హనుమాన్ సినిమా 2వ రోజు అన్ని ఏరియాల్లోనూ మంచి రెస్పాన్స్ సొంతం చేసకుంది. కానీ తక్కువ స్క్రీన్స్ కారణంగా సినిమా ఓవర్‌ఫ్లో ఇతర సినిమాలకు వెళ్లిందనే చెప్పాలి. అయినప్పటికీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.

 Prasanth Varma and Teja Sajja HanuMan Movie Day 2 Worldwide Collections

హనుమాన్ డే వైజ్ కలెక్షన్స్ చూస్తే... ప్రీమియర్లు ద్వారా - రూ.2.85 కోట్లు రాబట్టింది. ఇక మొదటి రోజు రూ. 5.12 కోట్లు, రెండో రోజు రూ. 4.36 కోట్లు రాబట్టింది. ఇక మొత్తంగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో రూ. 12.33 కోట్లు షేర్ (రూ.19.50 కోట్ల గ్రాస్) వసూలు చేసి రికార్డు సృష్టించింది.

హనుమాన్ రెండవ రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ చూసుకుంటే నైజాం రూ.1.89 కోట్లు, సీడెడ్ రూ. 67 లక్షలు, ఉత్తర ఆంధ్రా 63 లక్షలు, తూర్పు రూ.32 లక్షలు, పశ్చిమ రూ.22 లక్షలు, గుంటూరు రూ.28 లక్షలు, కృష్ణ రూ.22 లక్షలు, నెల్లూరు రూ.13లక్షలు వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రెండవ రోజు రూ.4.36 షేర్ ( రూ.7.15 కోట్ల గ్రాస్) వసూలు చేసింది.

 Prasanth Varma and Teja Sajja HanuMan Movie Day 2 Worldwide Collections

హనుమాన్ సినిమా 2 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూస్తే...నైజాం రూ.5.55 కోట్లు, సీడెడ్ రూ.1.53 కోట్లు, ఉత్తర ఆంధ్రా 1.57 కోట్లు, తూర్పు రూ.1.22 కోట్లు, పశ్చిమ రూ 70 లక్షలు, గుంటూరు రూ.83 లక్షలు, కృష్ణ రూ.56 లక్షలు, నెల్లూరు రూ.37 లక్షలు వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రెండు రోజుల్లో రూ.12.33 షేర్ ( రూ.19.50 కోట్ల గ్రాస్) వసూలు చేసింది.

ఇక కర్ణాటకలో రూ. 2.05కోట్లు, హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.3.25 కోట్లు, ఓవర్సీస్ లో 6.95 కోట్లు రాబట్టింది. ఇక మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే రెండు రోజుల్లో ఈ సినిమా రూ.24.58 కోట్లు షేర్ (రూ.45.45 కోట్ల గ్రాస్) వసూలు చేసింది. హనుమాన్ సినిమాకు భారీగానే బిజినెస్ నమోదు చేసుకుంది. ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొనడంతో... భారీ బిజినెస్ జరిగింది.

 Prasanth Varma and Teja Sajja HanuMan Movie Day 2 Worldwide Collections

హనుమాన్ సినిమా మొత్తం వ్యాపారం రూ.29.65 కోట్లకు జరిగింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 30.50 కోట్లుగా బరిలోకి దిగింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే... ఇంకా మరో 5.92 కోట్లు కావాలి. అలా అయితే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నట్లు. రూ.5.92 కోట్లు రావడం అనేది చాలా ఈజీ.. ఇంకో 1 లేదా రెండు రోజుల్లో ఈ టార్గెట్ ఫినిష్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X