twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    KGF Chapter 2 closing collections బాక్సాఫీస్ దుమ్ము దులిపిన కేజీఎఫ్2.. ఇండియన్ సీఈవో కొల్లగొట్టిన లాభం ఎంతంటే?

    |

    రాకింగ్ స్టార్ యష్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన KGF Chapter 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ట్రేడ్ అనలిస్టుల అంచనాలను తలదన్నేలా, సినీ ప్రముఖుల ఊహాగానాలకు భిన్నంగా విడుదలైన ప్రతీ చోట, ప్రతీ భాషలో కలెక్షన్ల కుంభవృష్టిని కురిపించింది. గత 37 రోజులుగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జైత్రయాత్రను కొనసాగించింది. అయితే గత 37 రోజుల్లో ఈ సినిమా ఏ రేంజ్‌లో వసూళ్లను రాబట్టిందంటే?

    347 కోట్ల బ్రేక్ ఈవెన్ అంచనాతో

    347 కోట్ల బ్రేక్ ఈవెన్ అంచనాతో

    KGF Chapter 2 చిత్రం రెగ్యులర్ బిజినెస్ భిన్నంగా థియేట్రికల్ రిలీజ్ జరిగింది. సాధారణంగా ప్రాంతాలు, భాషల వారీగా సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్మడం జరుగుతుంది. అయితే కేజీఎఫ్2 సినిమా విషయంలో డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లకు మధ్య నిర్మాతల చర్చలు సఫలం కాకపోవడంతో ఈ సినిమాను కమిషన్ బేస్ మీద, అడ్వాన్సు రూపంలో డిస్టిబ్యూటర్లు సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. దాంతో ఈ సినిమాను 345 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్‌గా ట్రేడ్ వర్గాలు వెలకట్టారు. దాంతో ఈ సినిమా 347 కోట్లు వసూలు చేస్తే లాభాల జోన్‌లోకి ప్రవేశిస్తుందనే అంచనా వేశారు.

    తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

    తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?


    తెలుగు రాష్ట్రాల్లో గత 37 రోజుల్లో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన వివరాలు ఇలా ఉన్నాయి. నైజాంలో 42.8 కోట్లు, సీడెడ్‌లో 12 కోట్లు, ఉత్తరాంధ్రలో 8 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 6 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కోట్లు, గుంటూరులో 5 కోట్లు, కృష్ణా జిల్లాలో 4.5 కోట్లు, నెల్లూరు జిల్లాలో 3 కోట్లు వసూలు చేసింది. దాంతో 137 కోట్ల గ్రాస్, 84 కోట్ల షేర్‌ను నమోదు చేసింది.

    దక్షిణాదిలో బిగ్గెస్ట్ హిట్‌గా

    దక్షిణాదిలో బిగ్గెస్ట్ హిట్‌గా


    ఇక తెలుగేతర రాష్ట్రాల్లో కేజీఎఫ్2 సినిమా వసూళ్ల వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో 183 కోట్ల గ్రాస్, 104 కోట్ల షేర్ వసూలు చేసింది. అలాగే తమిళనాడులో 54.6 కోట్ల షేర్, 112.52 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కేరళలో 32 కోట్ల షేర్, 67.65 కోట్ల గ్రాస్ నమోదు చేసింది. దాంతో దక్షిణాలోనే దాదాపు 260 కోట్ల షేర్‌ను నమోదు చేసింది.

    హిందీ మార్కెట్‌ను షేక్ చేసిన రాకీ భాయ్

    హిందీ మార్కెట్‌ను షేక్ చేసిన రాకీ భాయ్


    ఇక హిందీ, ఓవర్సీస్ మార్కెట్లలో కూడా కేజీఎఫ్2 చిత్రం ఊహించని విధంగా కలెక్షన్లు నమోదు చేసింది. హిందీలో 518.75 కోట్ల గ్రాస్, 221 కోట్ల షేర్ రాబట్టింది. ఓవర్సీస్‌లో 200 కోట్ల గ్రాస్, 99.15 కోట్ల షేర్‌ను అందించింది. దీంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1220 కోట్ల గ్రాస్, 600 కోట్ల షేర్‌ను రాబట్టింది.

    ప్రపంచవ్యాప్తంగా లాభం ఎంతంటే?

    ప్రపంచవ్యాప్తంగా లాభం ఎంతంటే?


    కేజీఎఫ్2 సినిమాను ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 345 కోట్లు వ్యాల్యూ చేయగా.. ఈ చిత్రం 347 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. దాదాపు ఈ చిత్రం 250 కోట్ల లాభాన్ని పంచడమే కాకుండా సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నమోదు చేసుకొన్నది.

    ఇండియన్ బాక్సాఫీస్ సీఈవోగా రాకీ భాయ్

    ఇండియన్ బాక్సాఫీస్ సీఈవోగా రాకీ భాయ్


    ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో కేజీఎఫ్2 చిత్రం అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. బాహుబలి2, దంగల్ తర్వాత ఆ స్థాయిలో భారీ వసూలు రాబట్టిన మూడో చిత్రంగా KGF Chapter 2 రికార్డును క్రియేట్ చేసింది. ఇటీవల విడుదలైన RRR చిత్రం సాధించిన 1200 కోట్ల రూపాయల రికార్డును కూడా అధిగమించింది. దాంతో ఇండియన్ బాక్సాఫీస్ సీఈవోగా యష్ అవతరించాడు.

    English summary
    Director Prashanth Neel and Yash's KGF Chapter 2 has released on April 14th. This film collected 1218 crores worldwide. It stood third highest grosser in Indian box office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X