KGF Chapter 2 day 16 collections చరిత్ర సృష్టించిన కేజీఎఫ్2.. 1000 క్లబ్‌లో చేరిన రాకీ భాయ్

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రాకింగ్ స్టార్ యష్ కాంబినేషన్‌లో వచ్చిన KGF Chapter 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. 16 తర్వాత కూడా ఈ సినిమా కలెక్షన్లు దుమారం సృష్టిస్తున్నది. మూడో వారంలో కూడా ఈ చిత్రం చెక్కు చెదరకుండా రికార్డులు క్రియేట్ చేస్తున్నది. హిందీ, ప్రాంతీయ మార్కెట్లలో ఆల్‌టైమ్ రికార్డులతో దూసుకెళ్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణను చూరగొన్న ఈ సినిమా 16వ రోజు కలెక్షన్లు, సాధించిన అరుదైన రికార్డులు, నమోదు చేసిన రికార్డులకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Recommended Video

KGF Chapter 2 : Yash & Prashant Neel Plans For a Powerful Climax | Filmibeat Telugu
హిందీలో ఆల్‌టైమ్ రికార్డ్స్

హిందీలో ఆల్‌టైమ్ రికార్డ్స్

KGF Chapter 2 చిత్రానికి హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా విడుదలైన మూడు రోజులకే 144 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అప్పటి నుంచి ఈ సినిమా కలెక్షన్ల ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా హిందీలో ఆల్‌టైమ్ రికార్డులతో హోరెత్తించింది. తొలి మూడు రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన ఈ చిత్రం బాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసింది.

హిందీలో 350 కోట్ల క్లబ్‌లోకి

హిందీలో 350 కోట్ల క్లబ్‌లోకి

KGF Chapter 2 చిత్రం రెండో వారంలో సుమారు 75 కోట్ల రూపాయాలను సాధించింది. రెండోవారంలో శుక్రవారం 11.56 కోట్లు, శనివారం 18.25 కోట్లు, ఆదివారం 22.68 కోట్లు, సోమవారం 8.28 కోట్లు, మంగళవారం 7.48 కోట్లు, బుధవారం 6.25 కోట్లు, గురువారం 5.68 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 350 కోట్ల క్లబ్‌లో చేరింది.

తెలుగులో 125 కోట్ల గ్రాస్

తెలుగులో 125 కోట్ల గ్రాస్

ఇక KGF Chapter 2 చిత్రం నైజాం, ఆంధ్రాలో 16వ రోజున ఓ మోస్తారు కలెక్షన్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా ఈ సినిమా 1.25 కోట్ల గ్రాస్, 75 లక్షల షేర్‌ను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం 125 కోట్ల గ్రాస్ వసూళ్లు, 77.52 కోట్ల షేర్‌ను నమోదు చేసింది.

1000 కోట్ల గ్రాస్ కలెక్షన్లు

1000 కోట్ల గ్రాస్ కలెక్షన్లు

KGF Chapter 2 మూవీ గత 16 రోజుల్లో తమిళనాడులో 89 కోట్ల గ్రాస్, కేరళలో 60 కోట్లు, కర్ణాటకలో 163 కోట్లు, ఓవర్సీస్‌లో 177 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకొన్నది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1062 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇటీవల కాలంలో 1000 కోట్ల క్లబ్‌లో చేరిన రెండో చిత్రంగా రికార్డును సొంతం చేసుకొన్నది.

16 రోజుల్లో ఎంత లాభం ఎంతంటే?

16 రోజుల్లో ఎంత లాభం ఎంతంటే?

KGF Chapter 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా 345 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో 347 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో సినిమా బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. ఇప్పటి వరకు ఈ చిత్రం 1062 కోట్ల గ్రాస్, 489.47 కోట్ల షేర్‌ను సాధించింది. అంటే ఈ చిత్రం 142 కోట్లకుపైగా లాభాలను నమోదు చేసుకొన్నది.

1500 కోట్లపై కన్నేసిన రాకీభాయ్

1500 కోట్లపై కన్నేసిన రాకీభాయ్

KGF Chapter 2 కలెక్షన్ల ప్రవాహం ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ సినిమా సరికొత్త రికార్డులపై దృష్టిపెట్టినట్టు కనిపిస్తున్నది. త్వరలోనే KGF chapter 2 1500 కోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇదే జరిగితే బాహుబలి2 సినిమాకు చేరువయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X