KGF Chapter 2 day 2 WW collections.. 500 కోట్లకు చేరువలో.. ఆల్‌టైమ్ రికార్డులతో ప్రభంజనం

ఇండియన్ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డులను క్రియేట్ చేస్తూ KGF Chapter 2 మూవీ కలెక్షన్ల జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ఊహించని వసూళ్లను నమోదు చేస్తూ సంచలనంగా మారింది. రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా 165 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం రెండో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయంటే..

హిందీలో ఆల్‌టైమ్ రికార్డుతో

హిందీలో ఆల్‌టైమ్ రికార్డుతో

KGF Chapter 2 చిత్రం హిందీ వెర్షన్ కలెక్షన్ల సునామీ కొనసాగుతున్నది. తొలి రోజున ఈ చిత్రం 53.95 కోట్ల గ్రాస్ వసూళ్లను బాక్సాఫీస్‌పై కురిపిస్తే.. రెండో రోజు అంతకు మించిన జోష్ కనిపించింది. రెండో రోజు 46.79 కోట్ల వసూళ్లు సాధించడం సంచలనంగా మారింది. దాంతో ఈ సినిమా కేవలం హిందీ వెర్షన్ మాత్రమే 100 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరింది. హృతిక్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ సినిమాపై పేరటి ఉన్న రికార్డులను తిరగరాస్తున్నది.

కేరళలో అత్యధిక కలెక్షన్లతో రికార్డు

కేరళలో అత్యధిక కలెక్షన్లతో రికార్డు

KGF Chapter 2 సినిమా విషయానికి వస్తే.. కేవలం కన్నడ చిత్రంగా ప్రేక్షకులు భావించడం లేదనేది కలెక్షన్లను చూస్తే స్పష్టమవుతున్నది. కేరళలో ఈ సినిమా ప్రభంజనం కొనసాగుతున్నది. మలయాళ చిత్ర పరిశ్రమలో సరికొత్త ఆల్‌టైమ్ ఒపెనింగ్ రికార్డులను క్రియేట్ చేసింది.

మలయాళ బాక్సాఫీస్ షేక్

మలయాళ బాక్సాఫీస్ షేక్

కేరళలో KGF Chapter 2 సినిమా తొలి రోజు 7 కోట్లు గ్రాస్ కలెక్షన్లను రాబట్టడం ఓ రికార్డుగా మారింది. రెండో రోజు కూడా అంతకు మించిన జోరును కోనసాగింది. రెండో రోజున ఈ చిత్రం 9 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టడం ఈ సినిమాకు మలయాళంలో ఉన్న క్రేజ్ ఏంటో స్పష్టమవుతున్నది.

తమిళనాడు, కర్నాటకలో

తమిళనాడు, కర్నాటకలో

దక్షిణాది రాష్ట్రాల్లో KGF Chapter 2 వసూళ్లు సునామీ తీవ్రతరం అయినట్టు కనిపిస్తున్నది. కర్ణాటకలో 30 కోట్ల గ్రాస్, తమిళనాడు 14 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక తమిళనాడులో బీస్ట్ ప్రభంజనాన్ని తట్టుకొని ఏకంగా 14 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇదే జోరు మరో రెండు రోజులు సాగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

నైజాం, ఆంధ్రాలో వసూళ్లు

నైజాం, ఆంధ్రాలో వసూళ్లు

KGF Chapter 2 చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. తొలి రోజున 31 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు అంతకు మించి వసూళ్లను సాధించింది. నైజాం, ఆంధ్రాలో కలిపి ఈ చిత్రం 36 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకొన్నది. తొలి వారాంతానికి ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి.

ఓవర్సీస్‌లో రెండో రోజు

ఓవర్సీస్‌లో రెండో రోజు

ఇక ఓవర్సీస్‌లో యష్, ప్రశాంత్ నీల్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రం తొలి రోజున 23.90 కోట్లు రాబడితే.. రెండో రోజు అంతే మొత్తంగా వసూళ్లను నమోదు చేసింది. రెండో రోజున ఈ చిత్రం 24 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. మూడో రోజు ఈ చిత్రం 50 కోట్ల మైలురాయిని సునాయసంగా దాటడం ఖాయంగా మారింది.

Recommended Video

KGF Chapter 2 సంచలనం ..RRR,హాలీవుడ్ మూవీ కూడా వెనక్కే..| Oneindia Telugu
500 క్లబ్‌పై కన్నేసిన కేజీఎఫ్2

500 క్లబ్‌పై కన్నేసిన కేజీఎఫ్2

KGF Chapter 2 చిత్రం తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా 164.20 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. ఇక రెండో రోజున సుమారు 181 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ చిత్రం మొత్తంగా 345 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ వారాంతానికి ఈ చిత్రం 500 కోట్ల క్లబ్‌లో చేరడానికి సిద్ధంగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X