KGF 2 Day 4th hindi collections.. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు.. మరో ఆల్‌టైమ్ రికార్డు!
KGF Chapter 2 మూవీ కలెక్షన్ల సునామీ ఉత్తరాదిలో కొనసాగుతూనే ఉంది. లాంగ్ వీకెండ్ కారణంగా ఈ మూవీ భారీ వసూళ్లను సాధిస్తున్నది. హిందీ చిత్ర పరిశ్రమలో ఏ స్టార్ హీరో సాధించని ఓపెనింగ్స్ ఈ సినిమా సాధించింది. అయితే ఈ వసూళ్ల ప్రభంజనం మూడు రోజులుగా ఎక్కడా డ్రాప్ కాకుండా నిలకడగా రాబడుతున్నది. అయితే హిందీ వెర్షన్ సినిమా 4 రోజు పరిస్థితి ఎలా ఉండబోతుందంటే..

రికార్డు స్థాయిలో ఒపెనింగ్ డే కలెక్షన్లు
KGF Chapter 1 చిత్రం బాలీవుడ్‌లో ఊహించని వసూళ్లు సాధించడంతో KGFChapter 2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో రిలీజ్‌కు ముందే భారీగా అడ్వాన్సు బుకింగ్ జరిగింది. దాంతో ఈ సినిమా తొలి రోజు 53.95 కోట్లు రాబట్టింది. హిందీ చిత్ర పరిశ్రమలో ఇదే అత్యుత్తమ ఓపెనింగ్ డే కలెక్షన్లు కావడం గమనార్హం.

మూడు రోజులు హిందీ వసూళ్లు
ఇక తొలి రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్ జైత్రయాత్రను ప్రారంభించిన KGF Chapter 2 చిత్రం రెండో రోజు అదే జోష్‌ను కొనసాగించింది. శుక్రవారం 46.79 కోట్లు, శనివారం 42.90 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం హిందీలోనే 143.64 కోట్ల వసూళ్లను నమోదు చేసింది.

నాలుగో రోజున భారీగా అడ్వాన్స్ బుకింగ్
ఇక తొలివారాంతంలో తొలి ఆదివారం రోజున కూడా KGF Chapter 2 సినిమాకు భారీ స్పందన కనిపిస్తున్నది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రికార్డు స్థాయిలో జరిగింది. నాలుగో రోజున ఈ సినిమా 56 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వచ్చాయి. ఈ రేంజ్‌లో అడ్వాన్స్ బుకింగ్ జరగడం హిందీ సినీ పరిశ్రమలో ఇదే మొదటిసారి అని చెప్పుకొంటున్నారు.

మరో ఆల్‌టైమ్ రికార్డు చేరువగా
అయితే KGF Chapter 2 మూవీ హిాదీలో మరోసారి కొత్త రికార్డుకు చేరువైందనే మాటను ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సినిమా తొలి రోజున ఆల్ టైమ్ రికార్డుగా వసూలు చేసిన 53.95 కోట్లను 4వ రోజు అధిగమించే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. బాలీవుడ్ హీరోల రికార్డులు తునాతునకలైపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది.

500 కోట్ల క్లబ్‌లోకి
KGF Chapter 2 చిత్రం మరో అరుదైన రికార్డుకు చేరువ కానున్నది. నాలుగో రోజున కూడా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించే అవకాశం ఉంది. అదే జరిగితే ఈ సినిమా 500 కోట్ల క్లబ్‌లో చేరడానికి మార్గం సుగమమవుతుంది. దీంతో ఈ సినిమా సరికొత్త చరిత్రను లిఖించేందుకు సిద్ధమైంది.

3 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?
ఇప్పటి వరకు KGF Chapter 2 చిత్రం కర్ణాటకలో 72.50 కోట్ల గ్రాస్, తెలుగు రాష్ట్రాల్లో 68 కోట్లు, తమిళనాడులో 24.80 కోట్ల గ్రాస్, కేరళలో 21.40 కోట్ల గ్రాస్, హిందీ, ఇతర రాష్ట్రాల్లో 165 కోట్లు, ఓవర్సీస్‌లో ఈ సినిమా 58 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. దాంతో ఈ సినిమా 410 కోట్ల గ్రాస్, 245 కోట్ల షేర్‌ను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











