HanuMan హనుమాన్ ప్రభంజనానికి స్టార్ హీరోలు రికార్డులు ఫట్.. ఓవర్సీస్‌లో బాక్సాఫీస్ ఊచకోత ఎలా ఉందంటే?
టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ మూవీ ప్రభంజనం సృష్టిస్తుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబడుతుంది. చిన్న సిినిమాగా రిలీజ్ అయి.. బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు రాబడుతుంది. సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈసినిమా తాజాగా ఓవర్సీస్ లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. స్టార్ హీరోల రికార్డులను ఫట్ చేస్తూ.. హనుమాన్ దూసుకుపోతుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ప్రశాంత్ వర్మ తెరకెక్కించి హనుమాన్ చిత్రంలో హీరోగా తేజ సజ్జా నటించాడు. ఇక అమృత అయ్యార్ హీరోయిన్ గా నటించగా.. విలన్ గా వినయ్ రాయ్ నటించాడు. ఈ సినిమాను నిరంజన్ రెడ్డి 60 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఇక ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హీరో రవితేజ.. కోతి వానరానికి తన వాయిస్ ఇచ్చారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న పాన్ వరల్డ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

విడుదలకు ముందే ఈ సినిమా ప్రిమియర్లు వేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రిమియర్ల ద్వారా ఏ సినిమాకు రాని కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి. ఈ సినిమా 5 రోజుల్లో రాబట్టిన వసూళ్లు ఓ సారి గమనిస్తే... నైజంలో రూ.13.30 కోట్లు, సిడెడ్ రూ. 4 కోట్లు, ఉత్తర ఆంధ్రాలో రూ. 3.75 కోట్లు, తూర్పు రూ. 2.80 కోట్లు, పశ్చిమ రూ.1.71 కోట్లు, గుంటూరు రూ. 1.95 కోట్లు, కృష్ణ రూ. 1.56 కోట్లు, నెల్లూరులో రూ. 93 లక్షలు రాబట్టింది.
ఇలా తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ చిత్రం మొత్తంగా రూ. 30.07 కోట్లు షేర్ రాబట్టగా.. రూ. 48.45 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటకలో రూ. 5.60 కోట్లు రాబట్టగా.. హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ. 9.70 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ లో 16.10 కోట్లు రాబట్టగా.. వరల్డ్ వైడ్ 5 రోజుల హనుమాన్ కలెక్షన్స్ చూస్తే.. రూ. 61.47 కోట్ల షేర్ ( రూ. 115.90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

ఇదిలా ఉంటే చిత్రం బృందం తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఓవర్సీస్ లో ఈ చిత్రం నాలుగు మిలియన్ డాలర్స్ వసూలు చేసినట్లు... త్వరలో 5 మిలియన్ డాలర్ మార్కుకు చేరుకుంటున్నట్లు వెల్లడించింది. ఇక నాలుగు మిలియన్ డాలర్స్ ఇండియన్ కరెన్సీలో రూ.25 కోట్లకు పైగనే అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా రికార్డుకు స్టార్ హీరోల రికార్డులు అన్ని ఫట్ అయ్యాయి. నార్త్ అమెరికాలో బాహుబలి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు 20 మిలియన్ వసూలు చేశాయి.
సలార్ తెలుగు వర్షన్ 5 మిలియన్ డాలర్ల వరకు వసూళ్లు చేయగా.. రేపో మాపో.. హనుమాన్ సలార్ రికార్డును బ్రేక్ చేయనుంది. నాన్ రాజమౌళి రికార్డులను హనుమాన్ బ్రేక్ చేసేందుకు రెడీ అయిపోయింది. హనుమాన్ కేవలం మూడు నాలుగు రోజుల్లోనే నాలుగు మిలియన్ల డాలర్లను కొల్లగొట్టి బాక్సాఫీసును షేక్ చేస్తుంది.


Click it and Unblock the Notifications











