HanuMan: ఆల్ ఇండియా రికార్డు సృష్టించిన హనుమాన్.. అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా!

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా, అమృతా అయ్యర్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఈ చిత్రంలో వినయ్ రాయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, గెటప్ శ్రీను, సత్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా జనవరి 12 తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఆల్ ఇండియా రికార్డును సృష్టించింది. ఆ వివరాల్లోకి వెళితే....

ఇండియన్ సూపర్ హీరో చిత్రంగా హనుమాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హనుమాన్ సినిమాను ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయగా.. నిర్మతగా నిరంజన్ రెడ్డి వ్యవహారించారు. ఆయన ఈ సినిమాను తక్కువ బడ్జెట్ చిత్రంగా రూపొందించాలని మొదట అనుకున్నారు. ఆ నేపథ్యంలోనే మొదట ఈ సినిమాను రూ.30 కోట్ల రూపాయలు అనుకున్నా... టీజర్, ట్రైలర్స్ కు వచ్చిన రెస్పాన్స్ తో ఈ సినిమాను మరింత ఎఫెక్ట్స్ తో రూపొందించాలని నిర్ణయించుకున్నారు.

Prashanth Varma Teja Sajja HanuMan Movie Created All Time India Record Full Details Here

ఇక ఈ సినిమా రెమ్యూనరేషన్స్ కు ఒక 10 నుంచి 12 కోట్లు కాగా.. మిగతా డబ్బంతా.. వీఎఫ్ఎక్స్ కు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను దాదాపు 60 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించారు. ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మొదటి సినిమాగా దీనిని తెరకెక్కించారు. రిలీజ్ అయ్యిన ప్రతి చోట నుంచి కూడా యూనానిమస్ పాజిటివ్ టాక్ ఈ చిత్రానికి లభించింది.

హనుమాన్ సినిమా మీద ఉన్న నమ్మకంతోనే మొదట చిన్నగా పైడ్ ప్రీమియర్స్ ని స్టార్ట్ చేశారు మేకర్స్. కానీ దీనికి అనూహ్యమైన స్పందన రావడంతో ఈ సంఖ్యని తాము పెంచుతూ వెళ్లారు చిత్ర బృందం. దీనితో రికార్డు స్థాయి రెస్పాన్స్ ఈ ప్రీమియర్స్ కి వచ్చింది. ఈ రెస్పాన్స్ తో హను మాన్ ఏకంగా ఇండియన్ రికార్డు సెట్ చేసినట్టుగా మేకర్స్ ప్రకటించారు.

Prashanth Varma Teja Sajja HanuMan Movie Created All Time India Record Full Details Here

మరి ఇండియా వైడ్ గా ఓ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ విషయంలో అత్యధిక వసూళ్లు వసూలు చేసిన ఏకైక సినిమాగా హను మాన్ నిలిచింది. ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా భారీ పోస్టర్ రిలీజ్ చేశారు. దీనితో హను మాన్ హవా ఏ లెవెల్లో ఉందో తెలుస్తోంది. ఇక ఈ మూవీ మొదటి రోజు భారీగా వసూళ్లను సాధించే అవకాశం తెలుస్తోంది.

ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా 5 కోట్లు వసూళ్లు చేయగా.. తొలి రోజున 8 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని అంఛనా. మరి చూడాలి ఈ సినిమా ఏ మేరకు వసూళ్లు రాబడుతుందోనని.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X