twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    zombie Reddy day 2 collections: బాక్సాఫీస్ వద్ద ఇంకా ఎంత రాబట్టాలి అంటే..?

    |

    అ! సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆ తరువాత రాజశేఖర్ తో కల్కి సినిమా చేశాడు. అయితే ఆ సినిమా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద పెద్దగా లాభాలను అయితే అంధించలేదు. ఇక మూడవసారి జాంబీస్ జానర్ ను టచ్ చేశాడు. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాంబీరెడ్డి బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది.

    నిర్మాత సేఫ్..

    నిర్మాత సేఫ్..

    మొదట ఈ సినిమా పెట్టిన పెట్టుబడులను నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా ముందే లాభాలను రాబట్టింది. జాంబీ రెడ్డి టీజర్ కు ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో రీమేక్ రైట్స్, హిందీ డబ్, శాటిలైట్ రైట్స్ ద్వారా ముందే నిర్మాత సేఫ్ జోన్ లోకి వచ్చాడు. ప్రశాంత్ వర్మ గత సినిమాలు టెక్నీకల్ గా మంచి రెస్పాన్స్ అందుకోవడం ఈ సినిమా బిజినెస్ కు ప్లస్ అయ్యింది.

    టార్గెట్ చిన్నదే..

    టార్గెట్ చిన్నదే..

    ఇక సినిమా బ్రేక్ ఈవెన్ కూడా పెద్దది కాదు. నిర్మాతలు సొంతంగానే సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేశారు. ముఖ్యంగా చేసిన ప్రమోషన్స్ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయనే చెప్పాలి. ఇక సినిమా మొదటి రోజే మిక్సీడ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ గట్టిగానే అందుకుంది.

     మొదటి రోజు కలెక్షన్స్

    మొదటి రోజు కలెక్షన్స్

    మొదటి రోజు సినిమా వరల్డ్ వైడ్ గా 1.02కోట్ల షేర్స్ ను అందుకుంది. పోటీగా మరికొన్ని చిన్న సినిమాలు విడుదలైనప్పటికి పెద్దగా ప్రభావం పడలేదు. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వీలైనంత వరకు ఈ టార్గెట్ ను మొదటి మూడు రోజుల్లోనే అందుకోవాల్సి ఉంటుంది.

    రెండు రోజుల్లో ఎంత వచ్చాయి అంటే..

    రెండు రోజుల్లో ఎంత వచ్చాయి అంటే..

    ఇక శనివారం రెండవరోజు కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 0.91కోట్లతో స్ట్రాంగ్ గానే ఉన్నట్లు అనిపిస్తున్నప్పటికి బ్రేక్ ఈవెన్ కావాలి అంటే కలెక్షన్స్ మరింత పెరగాలి. నైజం, సీడెడ్ లో కలెక్షన్స్ బాగానే పెరుగుతున్నాయి. మొత్తం రెండు రోజుల్లో సినిమా వరల్డ్ వైస్ గా 2కోట్ల వరకు షేర్స్ ను అందించినట్లు తెలుస్తోంది.

    టార్గెట్ ను అందుకోవాలి అంటే..

    టార్గెట్ ను అందుకోవాలి అంటే..

    మరో రెండు కోట్ల షేర్స్ వస్తే సినిమా అనుకున్న టార్గెట్ ను అందుకుంటుంది. కానీ శుక్ర, శని వారాల్లో పెద్దగా తేడా ఏమీ అనిపించలేదు. ఆదివారం కలెక్షన్స్ పైనే చిత్ర యూనిట్ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఇక సోమవారం నుంచి కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది మరొక బిగ్ సస్పెన్స్. చూడాలి మరి ఏం జరుగుతుందో..

     పాన్ ఇండియా రేంజ్ లో సీక్వెల్

    పాన్ ఇండియా రేంజ్ లో సీక్వెల్

    ఇక జాంబీ రెడ్డి టీజర్ వచ్చినప్పుడే రీమేక్ హక్కులపై ఆఫర్స్ చాలానే వచ్చాయట. ఈ సినిమాను పెద్ద హీరోతో తీస్తే మార్కెట్ ఇంకా బాగుండేదని చెబుతున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇక చాలా వేగంగా తియ్యాలని హీరోగా తేజను సెలెక్ట్ చేసుకున్నని అంటూ.. హిట్టయితే పాన్ ఇండియా రేంజ్ లో సీక్వెల్ తీసేందుకు రెడీగా ఉంటాను. ఆఫర్స్ కూడా వస్తున్నాయి. అంటూ.. ప్రశాంత్ వర్మ వివరణ ఇచ్చారు.

    English summary
    Awe! Director Prashant Verma, who received a special recognition for himself as a different director with the film, later tried to impress with a different film with Kalki. Both films, however, did not make a big profit at the box office commercially. And for the third time he is coming up with an experiment called Never Before,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X