ఉన్నంతలో 'ప్రస్ధానం' చిత్రమే బెటర్ ( ట్రేడ్ టాక్)
ఈ వారం తెలుగులో ఐదు చిత్రాలు రిలీజయ్యాయి. వాటిల్లో రెండు తమిళ అనువాదాలు కాగా,మరొకటి హిందీ అనువాదం, రెండు స్ట్రైయిట్ తెలుగు చిత్రాలు. స్ట్రైయిట్ చిత్రాలు..సాయికుమార్, శర్వానంద్ ల ప్రస్ధానం, బాలాదిత్య ..1940 లో ఒక గ్రామం. వీటిల్లో ప్రస్దానం రిలీజైన నాటి నుండి డైవైడ్ టాక్ తెచ్చుకుంది. రిలీజైన మూడో రోజే ఈ చిత్రంలో నాలుగు పాటలు తొలిగించి (దాదాపు ఇరవై నిముషాలు) ట్రిమ్ చేసారు. అలాగే కృష్ణవంశీ, తేజ, క్రిష్ ఇలా రోజుకో దర్శకుడు చేత ఈ చిత్రం గురించి చెప్పిస్తూ పబ్లిసిటీ కాంపయిన్ ప్రారంభించారు. ఇక నేషనల్ అవార్డు తెచ్చుకున్న 1940లో ఒక గ్రామం చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ తీసుకుని రిలీజ్ చేసారు. అయితే నేషనల్ అవార్డు వచ్చింది కదా అని ధియోటర్ కి వెళ్ళిన ప్రేక్షకుడుకి దర్శకుడు అనుభవలేమితో ఇబ్బందిపెట్టడం జరుగుతోంది. దాంతో కథగా బాగానే ఉన్నా చెప్పే విధానంలో సమస్యలో బాగోలేదని పెదవి విరుస్తున్నారు.
ఇక డబ్బింగ్ చిత్రాల్లో 1977, మదనుడు రెండు చిత్రాలూ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. నమిత,ఫర్జానాలు విప్పి చూపించినా ఎవరికీ కిక్కు ఇవ్వటంలేదని 1977 చూసిన వారు చెప్తున్నారు. ఇక మదనుడు చిత్రానికి ఏదో ఆశించి వెళితే అలాంటిదేమీ లేకపోవటం జరుగుతోందని సమాచారం. తమిళంలో కూడా ఆ సినిమాలు వర్కవుట్ కాకపోయినా వాటిని డబ్బింగ్ చేసి ఇక్కడ రిలీజ్ చేసారు. అలాగే రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ఆవహం(ఫూంక్ 2 సీక్వెల్) హిందీ డబ్బింగ్ హర్రర్ గా వచ్చి ఎవరిని భయపెట్టలేకపోయింది. ఇక క్రింతం వారం రిలీజైన బెట్టింగ్ బంగార్రాజుకి ధియోటర్లలలో జనం చాలా పలచగా ఉంటున్నారు. దానితో పాటు రిలీజైన పోలీస్ పోలీస్, మౌనరాగం చిత్రాలయితే ప్రేక్షకులుకు మౌనవేదన కల్గిస్తున్నాయి. ఈ చిత్రాలన్నిటిలో ఓ వర్గానికైనా నచ్చుతున్న ప్రస్దానం చిత్రమే బెటర్ అని తేలుస్తున్నారు.


Click it and Unblock the Notifications











