twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రతిరోజూ పండగే ఫస్ట్ డే కలెక్షన్లు.. ఓకే అనిపించేలా రిపోర్ట్స్

    |

    వరుస పరాజయాలతో ఉన్న దర్శకుడు సక్సెస్ ట్రాక్ ఎక్కాలని.. ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న తన కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలనుకునే హీరో. ఇలా ఇద్దరు వేర్వేరు పరిస్థితుల్లో ఉన్న సాయి తేజ్-మారుతి కలిసి చేసిన చిత్రమే ప్రతిరోజూ పండగే. దర్శకుడైన మారుతి తన పంథాను పూర్తిగా మార్చుకుని ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తీశాడు. అయితే తన స్టైల్ కామెడీని ఎక్కడా మిస్ అవకుండా చూసుకున్న మారుతికి.. సక్సెస్‌ను తెచ్చి పెడుతుందో లేదో చూడాలి. అయితే మొదటి రోజు ఈ చిత్రం ఎంత రాబట్టిందో ఓ సారి చూస్తే.. సక్సెస్ ట్రాక్‌లోకి ఎక్కిందో లేదో చెప్పవచ్చు.

    చేసిన బిజినెస్ ఎంత..?

    చేసిన బిజినెస్ ఎంత..?

    మొదటి రోజు కలెక్షన్లు చూసే ముందు అసలీ సినిమా ఎంత బిజినెస్ చేసింది, ఎంతకు అమ్ముడుపోయిందన్న వివరాలను ఓసారి చూద్దాం. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 16కోట్లకు అమ్ముడు పోగా.. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 18కోట్ల మేర బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.

    ఏరియా వారిగా ఎంత రేటు పలికిందంటే..?

    ఏరియా వారిగా ఎంత రేటు పలికిందంటే..?

    ఈ చిత్రం నైజాంలో 5.5కోట్లు, సీడెడ్‌లో 2.7కోట్లు, ఈస్ట్ 1.3కోట్లు, వెస్ట్, 1.1 కోట్లు, గుంటూరు 1.4కోట్లు, కృష్టా 1.2కోట్లు, నెల్లూరు 60లక్షలు, మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 15.80కోట్ల మేర బిజినెస్ చేయగా, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లెక్కలను కూడా చూస్తే దాదాపు 17.80కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.

    ఓకే అనిపించేలా ఫస్ట్ డే కలెక్షన్లు..

    ఓకే అనిపించేలా ఫస్ట్ డే కలెక్షన్లు..

    నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన రూలర్ లాంటి మాస్ ఎంటర్‌టైనర్‌తో పోటీ పడటం మొదటి రోజు కలెక్షన్లపై కాస్త ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల కంటే.. మాస్ మసాలా చిత్రాలకే ఓపెనింగ్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. దీంతో రూలర్ మొదటి రోజు దాదాపు ఆరు కోట్లు కొల్లగొట్టినట్టు తెలుస్తుండగా.. ప్రతిరోజూ పండగే రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.5కోట్లు కలెక్ట్ చేసినట్టు టాక్.

    మొత్తంగా మొదటి రోజు..

    మొత్తంగా మొదటి రోజు..

    ఆన్‌లైన్ బుకింగ్ గ్రాఫ్ చూస్తే ప్రతిరోజూ పండగే చిత్రానికి ఆట ఆటకు పెరుగుతూ వచ్చింది. ఇది మంచి పరిణామమే. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 4.5కోట్ల వరకు వసూళు చేసి ఉంటుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 18.5కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.

    English summary
    Prathiroju Pandage First Day World Wide Box office Collections. Sai Dharam tej, raashi Khanna And Sathya Raj Are Lead Role. Maruthi Directed This Movie While Bunny Vas Produced.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X