మొదటి రోజు కంటే 13వ రోజే ఎక్కువ.. 'ప్రతీ రోజు పండగే' కలెక్షన్ల ప్రవాహం

Recommended Video

Prathi Roju Pandage Movie Team Success Sambaralu | Sai Dharam Tej | Raashi Khanna | Maruthi

మారుతి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన సినిమా 'ప్రతిరోజూ పండగే' సినిమా నేటికీ హవా కొనసాగిస్తూనే ఉంది. డిసెంబర్ 20వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి షోతోనే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి టాక్‌ తెచ్చుకొని లాభాల బాటలో పయనిస్తోంది. చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటించింది. విడుదలై 13 రోజులు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఎంత రాబట్టిందో చూద్దామా..

ఫస్ట్ డే టాక్.. కలెక్షన్స్

ఫస్ట్ డే టాక్.. కలెక్షన్స్

'ప్రతీ రోజు పండగే' సినిమా విడుదలైన మొదటి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఆ తరవాత మెల్లగా పుంజుకొని కోట్లు కొల్లగొట్టింది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మొదటి రోజు చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబట్టింది. తొలి రోజు 3.23 కోట్లు మేర వసులు చేసి నేటికీ అదే ప్రవాహం కొనసాగిస్తోంది.

తొలి రోజుతో పోల్చుతే 13వ రోజే ఎక్కువ

తొలి రోజుతో పోల్చుతే 13వ రోజే ఎక్కువ

విడుదలైన అన్ని ఏరియాల్లో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది 'ప్రతీ రోజు పండగే' మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటుగా క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంటూ భేష్ అనిపించుకుంటోంది. అయితే ప్రత్యేకించి సీడెడ్ ఏరియాలో ఈ సినిమాకు సంబంధించి ఓ విశేషం చోటుచేయుకుంది. అక్కడ తొలి రోజుతో పోల్చుతే 13వ రోజే ఎక్కువ వసూళ్లు రాబట్టింది 'ప్రతీ రోజు పండగే' సినిమా.

నైజాం ఏరియాలో మొత్తంగా చూస్తే..

నైజాం ఏరియాలో మొత్తంగా చూస్తే..

జనవరి 1న న్యూ ఇయర్ సందర్బంగా ఈ చిత్రం ఒక్క నైజాం ఏరియాలోని 2.96 కోట్లు వసూలు చేసింది మొత్తం 'ప్రతీ రోజు పండగే' మూవీ. మొత్తంగా నైజాం ఏరియాకు సంబంధించి చూస్తే 13 రోజుల్లో 22 కోట్ల గ్రాస్, 10.59 కోట్ల షేర్ వసూలు చేసి సాయి ధరమ్ తేజ్, మారుతీ కెరీర్‌లో సరికొత్త రికార్డు నమోదు చేసింది.

 ప్రపంచ వ్యాప్తంగా 13 రోజుల్లో..

ప్రపంచ వ్యాప్తంగా 13 రోజుల్లో..

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశంలోని ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ మార్కెట్ తో 'ప్రతీ రోజు పండగే' హంగామా నడుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల షేర్ రాబట్టింది. ఈ మేరకు ఇంతటి ఘనవిజయం అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతూ పోస్టర్ రిలీజ్ చేసింది 'ప్రతీ రోజు పండగే' చిత్రయూనిట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X