ప్రతిరోజూ పండగే ఫైనల్ కలెక్షన్స్.. దుమ్ముదులిపేసిన మెగా మేనల్లుడు

Recommended Video

Prati Roju Pandage Hit Or Flop ? || Prati Roju Pandage Closing Collections

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 'ప్రతిరోజూ పండగే' సినిమాతో సత్తా చాటాడు. కెరీర్‌లో సరైన బ్రేక్ కోసం ఎదురుచూసిన ఆయన ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ సాధించారు. గతేడాది డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది. సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని నిర్మాతలకు లాభాల పంట పండించింది. మరి ఈ చిత్ర ఫైనల్ కలెక్షన్స్ వివరాలు చూద్దామా..

తొలి నుంచే జోష్.. మెగా మేనల్లుడి కిక్

తొలి నుంచే జోష్.. మెగా మేనల్లుడి కిక్

మారుతి దర్శకత్వంలో రూపొందిన 'ప్రతిరోజూ పండగే' చిత్రానికి తొలిరోజే పాజిటివ్ స్పందన వచ్చింది. దాదాపు 800 స్క్రీన్స్‌‌లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. లాంగ్ రన్ కొనసాగించి నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లకు సంబరాల్లో ముంచెత్తింది.

 ఫుల్ రన్ కలెక్షన్స్ రిపోర్ట్.. ఎంత రాబట్టిందంటే

ఫుల్ రన్ కలెక్షన్స్ రిపోర్ట్.. ఎంత రాబట్టిందంటే

యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం తొలిరోజు దాదాపు 4 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి.. చివరి వరకూ అదే జోష్ కంటిన్యూ చేసింది. ఈ సినిమా విడుదలై నెల రోజుల కూడా పూర్తికావడంతో ఫుల్ రన్ కలెక్షన్స్ రిపోర్ట్స్ బయటకొచ్చాయి. మొత్తంగా ఈ నెల రోజుల్లో ప్రతిరోజూ పండగే మూవీ 34 కోట్లకు పైగా షేర్ వసూలు చేయడం విశేషం.

సినిమా విజయంలో కీలకపాత్ర

సినిమా విజయంలో కీలకపాత్ర

సంక్రాంతికి నెల ముందుగానే విడుదలైన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా చేరువ కావడంతో మూడు వారాల పాటు కలెక్షన్ల ప్రవాహం పారించింది. చిత్రంలో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌‌గా మారుతి తెరకెక్కించిన తీరు సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది. చిత్ర విజయం పట్ల దర్శకనిర్మాతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

విడుదలకు ముందే డిమాండ్.. ప్రీ రిలీజ్ బిజినెస్

విడుదలకు ముందే డిమాండ్.. ప్రీ రిలీజ్ బిజినెస్

విడుదలకు ముందే ప్రతిరోజూ పండగే చిత్రానికి మంచి డిమాండ్ నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వాస్తవానికి ఈ చిత్రం రూ. 18 కోట్లతో నిర్మించారు. మరియు థియేట్రికల్ హక్కులకు రూ .14 కోట్లు లభించాయి. దీంతో సినిమా విడుదలకు ముందే మేకర్స్ లాభాల్లో మునిగారు.

సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్

సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్

ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ మాంచి బ్రేక్ ఇచ్చింది. నైజాంలో సాయి తేజ్‌కు ఉన్న మార్కెట్ మరోసారి ప్రూవ్ చేస్తూ సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బాలయ్య 'రూలర్' సినిమాకు గట్టిపోటీ ఇచ్చిన ప్రతిరోజూ పండగే మూవీ మెగా అభిమానుల్లో సంబరాలు నింపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X