Predator: Badlands Box Office: 3 రోజుల్లో 540 కోట్లు? షాకింగ్‌గా ప్రిడేటర్: బ్యాడ్ లాండ్ కలెక్షన్లు!

ప్రిడేటర్ ఫ్రాంచైజీలో తాజాగా వచ్చిన చిత్రం ప్రిడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్. సైన్స్, ఫిక్షన్, యాక్షన్ మూవీగా రూపొందిన ఈ సినిమాకు డాన్ ట్రాచ్‌టెన్‌బెర్గ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు జాన్ డేవిస్, బ్రెంట్ ఓ కానర్, మార్క్ టాబెరాఫ్, బెన్ రాసెన్‌బ్లాట్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాలో ఎల్లే ఫ్యానింగ్, డిమిట్రియస్ స్కస్టర్, కొలోమంటాంగి తదితరులు నటించారు.

ఈ సినిమాకు జెఫ్ కట్టర్ సినిమాటోగ్రఫిని, సారా స్కాచ్‌నర్, బెంజిమిన్ వాల్‌ఫిశ్చ్ మ్యూజిక్, స్టీఫాన్ గ్రబ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. లారెన్స్ గార్డన్ ప్రొడక్షన్స్, డెవిస్ ఎంటర్‌టైన్‌మెంట్, టాబర్‌ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రం నవంబర్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

Predator Badlands Day 1 Box Office Collections Worldwide

సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిన ఈ సినిమా కోసం భారీగా వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్, యాక్షన్ సీన్లను భారీగా చిత్రీకరించారు. అంతేకాకుండా టాప్ యాక్టర్లు, సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేశారు. ఈ చిత్ర యూనిట్ రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలుపుకొని ఈ సినిమాను సుమారుగా 105 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 930 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలను మించి ప్రభావం చూపించలేకపోయింది. ఇండియాలో పేలవంగా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో కూడా అంతంత మాత్రంగానే వసూళ్లను రాబడుతున్నది. దాంతో ఈ సినిమా వీకెండ్‌లో పుంజుకొంటుందా? అని ట్రేడ్ వర్గాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి.

ఇండియాలో ఈ చిత్రం తొలి రోజు 2 కోట్ల మేర వసూళ్లు సాధించవచ్చు అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇక తొలి వారాంతంలో ఈ చిత్రం అమెరికాలో 25 మిలియన్ డాలర్లు, మిగితా దేశాల్లో 35 మిలియన్ డాలర్లతో మొత్తంగా 60 మిలియన్ డాలర్లు అంటే.. 540 కోట్ల మేర వసూళ్లు సాధించవచ్చని లెక్కలు కడుతున్నారు. ఈ సినిమా అంచనాలను మించి వసూళ్లను సాధిస్తుందా? బ్రేక్ ఈవెన్ సాధించి భారీ అంచనాలను అందుకొంటుందా అనే కొన్ని రోజులు ఆగితే తెలియడం ఖాయంగా కనిపిస్తున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X