Premalu Box Office 50 కోట్లు కుమ్మేసిన ప్రేమలు.. ఫహద్ ఫాజిల్‌కు ఎన్ని కోట్ల లాభమంటే?
మలయాళం, ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ప్రేమలు చిత్రం కనకవర్షం కురిపిస్తున్నది. ట్రేడ్ వర్గాల అంచనాలకు భిన్నంగా చిన్న బడ్జెట్ చిత్రం భారీ లాభాలను నమోదు చేస్తున్నది. ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ నిర్మాతగా తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం దిశగా అడుగులేస్తున్నది. ఈ సినిమా బడ్జెట్, సాధించిన లాభాలు, 13 రోజుల కలెక్ష్ల వివరాల్లోకి వెళితే..
ప్రేమలు సినిమాలో పేరు, గుర్తింపు లేని యువతారలు నటించారు. నస్లేన్, మమితా, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. భావన స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాకు గిరీష్ ఏడీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తొలి రోజు నుంచే భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. మలయాళంలో మమ్మట్టి నటించిన భ్రమయుగం సినిమాతో పోటీ పడుతూ ఆ మూవీ కంటే భారీగా కలెక్షన్లు రాబడుతున్నది.

ప్రేమలు సినిమా విషయానికి వస్తే.. అన్ని ఖర్చులతో కలిపి 4 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. వాలంటైన్ డే కానుకగా యువతరానికి ఈ సినిమాను అందించారు.ఈ సినిమా రిలీజ్‌కు ముందు క్రేజ్ ఉండటంతో ఈ చిత్రాన్ని మలయాళంలో 250 స్క్రీన్లలో ప్రధాన నగరాల్లో 50 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్‌తో కలిపి సుమారుగా 600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
ఫహద్ ఫాజిల్ నిర్మాతగా రూపొందిన ప్రేమలు సినిమా తొలివారం భారీగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి మౌత్ టాక్ పెరగడంతో బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను రాబట్టింది. తొలివారంలో ఇండియాలో సుమారుగా 13 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. తొలివారమే ఈ చిత్రం భారీ లాభాల్లోకి ప్రవేశించింది.

ఇక ప్రేమలు చిత్రం రెండోవారంలో స్ట్రాంగ్‌గా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు సాధించింది. ఈ చిత్రం తోలివారం కంటే రెండోవారంలో అధికంగా వసూళ్లను రాబట్టింది. మలయాళంలోనే 12 కోట్లకుపైగా, ఇతర రాష్ట్రాల్లో 1.5 కోట్ల రూపాయలతో బ్లాక్‌బస్టర్ కలెక్షన్లను సాధించింది. దాంతో ఈ సినిమా మొత్తంగా ఇండియాలో 27 కోట్ల రూపాయల మేర కలెక్షన్లు నమోదు చేసింది.
ప్రేమలు సినిమా ఇండియాలో కంటే ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్లు నమోదు చేసింది. ఈ చిత్రాన్ని నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో భారీగా విడుదల చేశారు. ఈ చిత్రం ఓవర్సీస్‌లో 20 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ఇండియాలో 30 కోట్ల గ్రాస్, 27 కోట్లు నికరంగా కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 50 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.


Click it and Unblock the Notifications











