Premalu Collections ఫహద్ ఫాజిల్ మూవీకి భారీ కలెక్షన్లు.. కోట్లు కురిపిస్తున్న చిన్న మూవీ
దక్షిణాదిలో స్టార్ హీరో ఫాహిద్ ఫాజిల్ నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం ప్రేమలు. దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సహ నిర్మాతలు. గిరీష్ ఏడీ దర్శకత్వంలో రూపొందిన ఈసినిమాలో యువ నటీనటులు నెల్సన్, శ్యామ్ మోహన్, అఖిల భార్గవన్, మమితా, మీనాక్షి రవీంద్రన్, సంగీత్ ప్రతాప్, షామీర్ ఖాన్ తదితరులు నటించారు. ఫిబ్రవరి 9వ తేదీన రిలీజైన ఈ చిత్రం కేరళలో రికార్డు వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్, లవ్, బ్రేకప్ అంశాలతో రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ప్రేమలు చిత్రాన్ని ఫాహిద్ ఫాజిల్ సుమారుగా 4 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా విషయానికి వస్తే.. బ్రేకప్ అయిన అబ్బాయి, తలబిరుసుతనంతో ఉండే అమ్మాయి హైదరాబాద్‌లో కలుసుకొంటారు. వారిద్దరి పరిచయం ప్రేమగా మారిన తర్వాత ఏం జరిగింది అనేది సినిమా కథ.

ప్రేమలు సినిమా ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్‌కు భారీగా రెస్పాన్స్ రావడంతో కేరళలో భారీగా ఈ మూవీని రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని కేరళలో 300 స్క్రీన్లలో, ఇండియా వ్యాప్తంగా 450 స్క్రీన్లు, వరల్డ్ వైడ్‌గా 650 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
ప్రేమలు సినిమా సాధారణ ఆడియెన్స్‌తోపాటు క్రిటిక్స్ నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు కేరళ, ఇతర రాష్ట్రాల్లో తొలి రోజు 1.3 కోట్ల రూపాయల నికర వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో కలిపి ఈ చిత్రం 2 కోట్ల రూపాయలు నికరంగా, 2.5 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
ఇక ప్రేమలు సినిమా రెండో రోజు వసూళ్ల వివరాల్లోకి వెళితే.. మౌత్ ట్రాక్ భారీగా స్రెడ్ కావడంతో రికార్డు కలెక్షన్లు నమోదు చేసింది. రెండో రోజు కేరళ, ఇతర ప్రాంతాల్లో కలిపి 1.75 కోట్లు నికరంగా 2.5 గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్‌గా 2.25 కోట్లు నికరంగా..3 కోట్లు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ప్రేమలు చిత్రానికి అనూహ్యమైన స్పందన లభించడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండు రోజుల్లో 5.5 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ సినిమా రెండో రోజుకే బ్రేక్ ఈవెన్ సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమా రానున్న రోజుల్లో ఏ రేంజ్ కలెక్షన్లు రాబడుతుందో వేచి చూడాల్సిందే.
విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్ నిర్మించిన ప్రేమలు చిత్రం 3వ రోజు భారీగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం రెండు రోజుల కంటే ఎక్కువగా మూడో రోజు 3 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. ్రపపంచవ్యాప్తంగా 3.5 కోట్లు రాబట్టింది. దాంతో ఈ మూవీ 9 మొత్తంగా కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











