Premalu 10 Days Collections: లక్ అంటే రాజమౌళి కొడుకుదే.. రావాల్సింది 1.50 కోట్లే.. కానీ వసూళ్లు మాత్రం!
కొంచెం కామెడీ.. కొంత లవ్ స్టోరీతో రూపొందే సినిమాలకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభిస్తుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.
ఇప్పుడు అలా వచ్చి సెన్సేషనల్ హిట్ కొట్టిన మూవీనే 'ప్రేమలు'. మలయాళంలో 100 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీని.. రాజమౌళి కుమారుడు కార్తికేయ తెలుగులో రిలీజ్ చేశాడు. అతడి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మరి 'ప్రేమలు' మూవీ 10 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!

ప్రేమలు ఎలా వచ్చిందంటే
నస్లెన్ కే గఫూర్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో గిరీష్ ఏడీ దర్శకత్వంలో రూపొందిన సినిమానే 'ప్రేమలు'. ఈ క్రేజీ మూవీని భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లు నిర్మించారు. ఈ చిత్రంలో అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్‌తో పాటు శ్యామ్ మోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విష్ణు విజయ్ దీనికి మ్యూజిక్ కంపోజ్ చేశారు.

తెలుగు బిజినెస్ ఎంతంటే
మలయాళంలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న 'ప్రేమలు' సినిమాను చూసిన ఎస్ఎస్ కార్తికేయ.. అది తనకు బాగా నచ్చడంతో తెలుగులోకి డబ్బింగ్ చేయాలని నిర్ణయించాడు. ఇందుకోసం ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులను రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని మార్చి 8వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశాడు.

10వ రోజు భారీ వసూళ్లతో
ఫన్ అండ్ యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో రూపొందిన 'ప్రేమలు' చిత్రానికి ఆరంభం నుంచే తెలుగులో మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రం ఇక్కడ 'గామి', 'భీమా' మూవీలను మించిన రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. ఇలా 10వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'ప్రేమలు' మూవీ హోల్ట్ కనబరుస్తూ రూ. 60 లక్షలు షేర్, రూ. 1.10 కోట్లు గ్రాస్ అందుకుంది.
10 రోజులకు ఎంతంటే
భారీ అంచనాలతో వచ్చి తెలుగు రాష్ట్రాల్లో కూడా 'ప్రేమలు' మూవీ భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. ఫలితంగా 10 రోజుల్లో నైజాం ఏరియాలో రూ. 2.11 కోట్లు షేర్ వసూలు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రూ. 1.65 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. ఇలా ఇప్పటి వరకూ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.76 కోట్లు షేర్, రూ. 7.20 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

ఓవర్సీస్‌లో కలిపి ఇలా
యూత్‌ను మెప్పించే స్టోరీతో రూపొందిన 'ప్రేమలు' సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ ఓవర్సీస్‌లో కూడా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అక్కడ ఈ సినిమా 10 రోజుల్లోనే 225K డాలర్లను కూడా వసూలు చేసింది. అంటే రూ. 70 లక్షలు వరకూ షేర్‌ను వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.46 కోట్లు షేర్‌ను కలెక్ట్ చేసింది.

టార్గెట్ ఇలా.. లాభమెంత
'ప్రేమలు' మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను ఎస్ఎస్ కార్తికేయ రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేశాడు. అంటే.. రూ. 1.50 కోట్లు షేర్ వసూలు చేస్తేనే ఈ చిత్రం హిట్ అవుతుంది. అలాంటిది 10 రోజుల్లోనే 'ప్రేమలు' మూవీ రూ. 4.46 కోట్లు రాబట్టింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.96 కోట్లు లాభాలను కూడా అందుకుని సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది.


Click it and Unblock the Notifications











