Premalu 11 Days Collections: చరిత్ర సృష్టించిన ప్రేమలు.. తెలుగులో ఫస్ట్ మూవీగా సంచలన రికార్డు

మిగిలిన జోనర్లతో పోల్చుకుంటే కామెడీ అండ్ లవ్ ఎంటర్‌టైనర్‌లుగా వచ్చే చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అందుకే చాలా భాషల్లో ఈ తరహా సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. ఇలా ఈ మధ్యనే మలయాళంలో వచ్చి సెన్సేషనల్ హిట్‌ను సొంతం చేసుకున్న చిత్రం 'ప్రేమలు'. అక్కడ సత్తా చాటిన ఈ మూవీని ఎస్ఎస్ కార్తికేయ తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేశాడు. ఇక్కడ ఈ మూవీ భారీ రెస్పాన్స్‌తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో 'ప్రేమలు' మూవీ 11 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!

ప్రేమలు ఎలా వచ్చిందంటే
నస్లెన్ కే గఫూర్, మమితా బైజు జంటగా గిరీష్ ఏడీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే 'ప్రేమలు'. ఈ క్రేజీ మూవీని భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లు నిర్మించారు. ఈ చిత్రంలో అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్‌తో పాటు శ్యామ్ మోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విష్ణు విజయ్ దీనికి సంగీతం ఇచ్చారు.

Premalu Movie 11 Days Telugu Collections Details

తెలుగు బిజినెస్ ఎంతంటే
మలయాళంలో వంద కోట్ల వసూళ్లు సొంతం చేసుకున్న 'ప్రేమలు' సినిమాను చూసిన ఎస్ఎస్ కార్తికేయ.. అది తనకు బాగా నచ్చడంతో తెలుగులోకి తీసుకు రావాలని అనుకున్నాడు. ఇందుకోసం ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులను రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేశాడు. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని మార్చి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసుకున్నాడు.

11వ రోజు భారీ వసూళ్లతో
యువతను ఆకట్టుకునే అంశాలతో రూపొందిన 'ప్రేమలు' చిత్రానికి ఆరంభం నుంచే తెలుగులో మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రం ఇక్కడ 'గామి', 'భీమా' మూవీలను మించిన రెస్పాన్స్‌ను అందుకుంటోంది. కానీ, 11వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'ప్రేమలు' మూవీ డౌన్ అయిపోయింది. దీంతో రూ. 35 లక్షలు షేర్, రూ. 60 లక్షలు గ్రాస్ అందుకుంది.

Premalu Movie 11 Days Telugu Collections Details

11 రోజులకు ఎంతంటే
అంచనాలకు తగ్గట్లుగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా 'ప్రేమలు' మూవీ భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఫలితంగా 11 రోజుల్లో నైజాం ఏరియాలో రూ. 2.44 కోట్లు షేర్ వసూలు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రూ. 1.96 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. ఇలా ఇప్పటి వరకూ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.40 కోట్లు షేర్, రూ. 7.71 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

ఓవర్సీస్‌లో కలిపి ఇలా
'ప్రేమలు' సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ ఓవర్సీస్‌లో కూడా గ్రాండ్‌గా విడుదల అయింది. అక్కడ ఈ సినిమా 11 రోజుల్లోనే 250K డాలర్లను రాబట్టింది. అంటే రూ. 1.20 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసింది. వీటితో కలిపితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.60 కోట్లు షేర్‌, రూ. 10 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. తద్వారా తెలుగులో పది కోట్ల గ్రాస్ మార్కును దాటిన తొలి మలయాళ చిత్రంగా రికార్డు సాధించింది.

Premalu Movie 11 Days Telugu Collections Details

టార్గెట్ ఇలా.. లాభమెంత
'ప్రేమలు' మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను ఎస్ఎస్ కార్తికేయ రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేశాడు. అంటే.. రూ. 1.50 కోట్లు షేర్ వసూలు చేస్తేనే ఈ చిత్రం హిట్ అవుతుంది. అలాంటిది 11 రోజుల్లోనే 'ప్రేమలు' మూవీ రూ. 5.60 కోట్లు రాబట్టింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 4.10 కోట్లు లాభాలను కూడా అందుకుని సరికొత్త రికార్డును ఖాతాలో వేసేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X