Premalu 12 Days Collections: ప్రేమలు మూవీకి రికార్డు వసూళ్లు.. రాజమౌళి కొడుక్కి లాభం ఎంతంటే!

యువతను ఆకట్టుకునే ప్రేమకథలో వచ్చే సినిమాలు ఎక్కువ శాతం ప్రేక్షకుల ఆదరణనే అందుకుంటూ ఉంటాయి. వీటికి కొంచెం కామెడీ యాడ్ అయితే ఇక సంచలన విజయాలను కూడా సొంతం చేసుకుంటాయి. ఇప్పుడిది నిరూపించిన మరో చిత్రమే 'ప్రేమలు'. మలయాళంలో వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన ఈ సినిమాను ఎస్ఎస్ కార్తికేయ తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశాడు. అనుకున్నట్లుగానే ఇది భారీ వసూళ్లను రాబడుతూ సత్తా చాటుతోంది. మరి 'ప్రేమలు' మూవీ 12 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూసేయండి మరి!

ప్రేమలు అంటూ వచ్చారు
నస్లెన్ కే గఫూర్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా గిరీష్ ఏడీ దర్శకత్వంలో రూపొందిన సినిమానే 'ప్రేమలు'. ఈ క్రేజీ మూవీని భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లు నిర్మించారు. ఈ చిత్రంలో అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్‌తో పాటు శ్యామ్ మోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విష్ణు విజయ్ దీనికి మ్యూజిక్ ఇచ్చాడు

Premalu Movie 12 Days Telugu Collections Details

తెలుగు బిజినెస్ ఎంతంటే
మలయాళంలో 100 కోట్లు కొల్లగొట్టి చరిత్ర సృష్టించిన 'ప్రేమలు' సినిమాను చూసిన ఎస్ఎస్ కార్తికేయ.. అది తనకు బాగా నచ్చడంతో తెలుగులోకి తీసుకు రావాలని అనుకున్నాడు. ఇందుకోసం ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులను రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేశాడు. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని మార్చి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

12వ రోజు భారీ వసూళ్లతో
యూత్‌కు కనెక్ట్ అయ్యే కంటెంట్‌తో రూపొందిన 'ప్రేమలు' చిత్రానికి ఆరంభం నుంచే తెలుగులో మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రం ఇక్కడ 'గామి', 'భీమా' మూవీలను వెనక్కి నెట్టేసే రీతిలో దూసుకెళ్తోంది. కానీ, 12వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'ప్రేమలు' మూవీ డౌన్ అయిపోయింది. దీంతో రూ. 30 లక్షలు షేర్, రూ. 50 లక్షలు గ్రాస్ అందుకుంది.

Premalu Movie 12 Days Telugu Collections Details

12 రోజులకు ఎంతంటే
అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండానే తెలుగు రాష్ట్రాల్లో కూడా 'ప్రేమలు' మూవీ భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఫలితంగా 12 రోజుల్లో నైజాం ఏరియాలో రూ. 2.62 కోట్లు షేర్ వసూలు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రూ. 2.08 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. ఇలా ఇప్పటి వరకూ ఈ సినిమా రూ. 4.70 కోట్లు షేర్, రూ. 8.21 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

ఓవర్సీస్‌లో కలిపి ఇలా
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'ప్రేమలు' సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ ఓవర్సీస్‌లో కూడా గ్రాండ్‌గా విడుదల అయింది. అక్కడ ఈ సినిమా 12 రోజుల్లోనే 300K డాలర్లను రాబట్టింది. అంటే రూ. 1.40 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసింది. వీటితో కలిపితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.10 కోట్లు షేర్‌, రూ. 11.50 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

Premalu Movie 12 Days Telugu Collections Details

టార్గెట్ ఇలా.. లాభమెంత
'ప్రేమలు' మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను ఎస్ఎస్ కార్తికేయ రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేశాడు. అంటే.. రూ. 1.50 కోట్లు షేర్ వసూలు చేస్తేనే ఈ చిత్రం హిట్ అవుతుంది. అలాంటిది 12 రోజుల్లోనే 'ప్రేమలు' మూవీ రూ. 6.10 కోట్లు రాబట్టింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 4.60 కోట్లు లాభాలను కూడా అందుకుని సరికొత్త రికార్డును ఖాతాలో వేసేసుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X