Premalu 14 Days Collections: ప్రేమలు సంచలన వసూళ్లు.. కార్తికేయకు కోట్ల లాటరీ.. ఫస్ట్ మూవీగా రికార్డు
యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌లుగా వచ్చే సినిమాలకు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తుంటుంది. అందుకే ఈ మధ్య కాలంలో ఇలాంటి చిత్రాలు అన్ని భాషల్లోనూ వస్తున్నాయి. అలా ఇటీవలే మలయాళంలో రూపొంది సంచలన విజయాన్ని అందుకున్న చిత్రమే 'ప్రేమలు'. క్రేజీ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాను రాజమౌళి కొడుకు కార్తికేయ తెలుగులోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేశాడు. అతడి నమ్మకాన్ని నిలబెడుతూ ఈ సినిమా సంచలన వసూళ్లు సాధించింది. మరి 'ప్రేమలు' మూవీ 14 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో మీరే చూసేయండి మరి!
క్రేజీ కాన్సెప్టుతో ప్రేమలు
నస్లెన్ కే గఫూర్, మమితా బైజు జోడీగా గిరీష్ ఏడీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమానే 'ప్రేమలు'. ఈ క్రేజీ మూవీని భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లు నిర్మించారు. ఈ చిత్రంలో అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్‌తో పాటు శ్యామ్ మోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విష్ణు విజయ్ దీనికి సంగీతాన్ని సమకూర్చారు.

తెలుగు బిజినెస్ ఎంతంటే
మలయాళంలో వంద కోట్ల వసూళ్లను రాబట్టి చరిత్రను సృష్టించిన 'ప్రేమలు' సినిమా చూసి ఫిదా అయిన ఎస్ఎస్ కార్తికేయ.. దీన్ని తెలుగులో విడుదల చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం ఈ సినిమా డబ్బింగ్ హక్కులను రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేశాడు. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని మార్చి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేశాడు.
14వ రోజు భారీ వసూళ్లతో
యువతను ఆకట్టుకునే కథాంశంతో రూపొందిన 'ప్రేమలు' చిత్రానికి ఆరంభం నుంచే తెలుగులో మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రం ఇక్కడ 'గామి', 'భీమా' మూవీలను వెనక్కి నెట్టేసేలా దూసుకెళ్తోంది. కానీ, 14వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'ప్రేమలు' మూవీ డౌన్ అయిపోయింది. దీంతో రూ. 15 లక్షలు షేర్, రూ. 25 లక్షలు గ్రాస్ అందుకుంది.

14 రోజులకు ఎంతంటే
కార్తికేయ నమ్మకాన్ని నిలబెడుతూ తెలుగు రాష్ట్రాల్లో కూడా 'ప్రేమలు' మూవీ భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఫలితంగా 14 రోజుల్లో నైజాం ఏరియాలో రూ. 2.72 కోట్లు షేర్ వసూలు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రూ. 2.19 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. ఇలా ఇప్పటి వరకూ ఈ సినిమా రూ. 4.91 కోట్లు షేర్, రూ. 8.65 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.
ఓవర్సీస్‌లో కలిపి ఇలా
యూత్‌ఫుల్ కాన్సెప్టుతో రూపొందిన 'ప్రేమలు' సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ ఓవర్సీస్‌లో కూడా గ్రాండ్‌గా విడుదల అయింది. అక్కడ ఈ సినిమా 14 రోజుల్లోనే 300K డాలర్లకు పైగానే రాబట్టింది. అంటే రూ. 1.40 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసింది. వీటితో కలిపితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.31 కోట్లు షేర్, రూ. 11.55 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

టార్గెట్ ఇలా.. లాభమెంత
'ప్రేమలు' మూవీ డబ్బింగ్ రైట్స్‌ను ఎస్ఎస్ కార్తికేయ రూ. 1.20 కోట్లకు కొన్నాడు. అంటే.. రూ. 1.50 కోట్లు షేర్ వసూలు చేస్తేనే ఈ చిత్రం హిట్ అవుతుంది. అలాంటిది 14 రోజుల్లోనే 'ప్రేమలు' మూవీ రూ. 6.31 కోట్లు రాబట్టింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 4.81 కోట్లు లాభాలను కూడా అందుకుని.. ఈ రేంజ్ హిట్ అయిన తొలి మలయాళ చిత్రంగా నిలిచింది.


Click it and Unblock the Notifications











