Premalu 15 Days Collections: తెలుగులో ప్రేమలు మరో రికార్డు.. కోట్లు లాభపడ్డ రాజమౌళి కొడుకు

గతంలో కంటే ఈ మధ్య కాలంలో డబ్బింగ్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు మంచి స్పందన అందిస్తున్నారు. కంటెంట్ బాగుంటే ఎలాంటి చిత్రాన్నైనా హిట్ చేసేస్తున్నారు. దీన్ని ఇప్పుడు 'ప్రేమలు' సినిమాతో మరోసారి నిరూపించారు. మలయాళంలో సెన్సేషనల్ హిట్ అయిన ఈ మూవీని రెండు వారాల క్రితమే తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈ చిత్రం భారీ స్పందనను అందుకుంటోంది. ఫలితంగా అదిరిపోయే వసూళ్లను రాబడుతూ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో 'ప్రేమలు' మూవీ 15 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో మీరే లుక్కేయండి!

హైదరాబాద్ లవ్‌ స్టోరీతో
గిరీష్ ఏడీ దర్శకత్వంలో నస్లెన్ కే గఫూర్, మమితా బైజు జోడీగా నటించిన సినిమానే 'ప్రేమలు'. ఈ క్రేజీ మూవీని భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లు నిర్మించారు. విష్ణు విజయ్ దీనికి సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రంలో అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్‌తో పాటు శ్యామ్ మోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Premalu Movie 15 Days Telugu Collections Details

తెలుగు బిజినెస్ ఎంతంటే
మలయాళంలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న 'ప్రేమలు' సినిమాను రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ తెలుగులో విడుదల చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం ఈ సినిమా డబ్బింగ్ హక్కులను రూ. 1.20 కోట్లకు దక్కించుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్‌ను మార్చి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేశాడు.

15వ రోజు భారీ వసూళ్లతో
యూత్‌ను ఆకర్షించే కథాంశంతో తెరకెక్కిన 'ప్రేమలు' చిత్రానికి ఆరంభం నుంచే తెలుగులో మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రం ఇక్కడి మూవీలను వెనక్కి నెట్టేసేలా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. కానీ, 15వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'ప్రేమలు' మూవీ రెస్పాన్స్ పడిపోయింది. దీంతో రూ. 15 లక్షలు షేర్, రూ. 25 లక్షలు గ్రాస్ మాత్రమే లభించింది.

Premalu Movie 15 Days Telugu Collections Details

15 రోజులకు ఎంతంటే
హైదరాబాద్ నేపథ్యంతో సాగే ప్రేమకథతో రూపొందిన 'ప్రేమలు' మూవీ భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఫలితంగా 15 రోజుల్లో నైజాం ఏరియాలో రూ. 2.80 కోట్లు షేర్ వసూలు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రూ. 2.31 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. ఇలా ఇప్పటి వరకూ ఈ సినిమా రూ. 5.11 కోట్లు షేర్, రూ. 9.01 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

ఓవర్సీస్‌లో కలిపి ఇలా
క్రేజీ స్టోరీతో తెరకెక్కిన 'ప్రేమలు' సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ ఓవర్సీస్‌లో కూడా గ్రాండ్‌గా విడుదల అయింది. అక్కడ ఈ సినిమా 15 రోజుల్లోనే 300K డాలర్లకు పైగానే రాబట్టింది. అంటే రూ. 1.43 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసింది. వీటితో కలిపితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.54 కోట్లు షేర్‌, రూ. 12.00 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

Premalu Movie 15 Days Telugu Collections Details

టార్గెట్ ఇలా.. లాభమెంత
'ప్రేమలు' మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను ఎస్ఎస్ కార్తికేయ రూ. 1.20 కోట్లకు కొన్నాడు. అంటే.. రూ. 1.50 కోట్లు షేర్ వసూలు చేస్తేనే ఈ చిత్రం హిట్ అవుతుంది. అలాంటిది 15 రోజుల్లోనే 'ప్రేమలు' మూవీ రూ. 6.54 కోట్లు రాబట్టింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 5.04 కోట్లు లాభాలను కూడా అందుకుంది. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో రూ. 5 కోట్లు షేర్, ఓవరాల్‌గా రూ. 5 కోట్లు లాభాలను అందుకున్న తొలి మలయాళ చిత్రంగా రికార్డు సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X