Premalu 16 Days Collections: ప్రేమలు సంచలనం.. 16 రోజుల్లో కోట్ల వర్షం.. రాజమౌళి కొడుకు కుమ్మేశాడుగా!

ఫన్ ఎంటర్‌టైనర్‌లుగా రూపొందే ప్రేమకథా చిత్రాలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంటుంది. అందుకే ఈ మధ్య కాలంలో చాలా భాషల్లో ఈ తరహా మూవీలే ఎక్కువగా వస్తున్నాయి. అలా ఇటీవలే మలయాళంలో వచ్చి సెన్సేషనల్ హిట్ అయిన చిత్రమే 'ప్రేమలు'.

అక్కడ వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాను రాజమౌళి కుమారుడు కార్తికేయ తెలుగులో విడుదల చేశాడు. దీనికి ఇక్కడ భారీ స్పందనతో పాటు వసూళ్లు లభిస్తున్నాయి. మరి 'ప్రేమలు' మూవీ 16 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో మీరే చూసేయండి!

Premalu Movie 16 Days Telugu Collections Details

క్రేజీ లవ్ స్టోరీతో ప్రేమలు
నస్లెన్ కే గఫూర్, మమితా బైజు జోడీగా గిరీష్ ఏడీ దర్శకత్వంలో రూపొందిన చిత్రమే 'ప్రేమలు'. ఈ క్రేజీ మూవీని భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లు నిర్మించారు. ఈ చిత్రంలో అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్‌తో పాటు శ్యామ్ మోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విష్ణు విజయ్ దీనికి సంగీతాన్ని సమకూర్చారు.

Premalu Movie 16 Days Telugu Collections Details

తెలుగు బిజినెస్ ఎంతంటే

మలయాళంలో సంచలన విజయాన్ని నమోదు చేసిన 'ప్రేమలు' సినిమాను రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ తెలుగులో విడుదల చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం ఈ సినిమా డబ్బింగ్ హక్కులను రూ. 1.20 కోట్లకు దక్కించుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్‌ను మార్చి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేశాడు.

Premalu Movie 16 Days Telugu Collections Details

16వ రోజు భారీ వసూళ్లతో
ఫన్ అండ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ప్రేమలు' చిత్రానికి ఆరంభం నుంచే తెలుగులో మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రం ఇక్కడి మూవీలను వెనక్కి నెట్టేసేలా భారీ వసూళ్లతో సత్తా చాటుతోంది. కానీ, 16వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'ప్రేమలు' మూవీ రెస్పాన్స్ మళ్లీ పెరిగింది. దీంతో రూ. 25 లక్షలు షేర్, రూ. 45 లక్షలు గ్రాస్ మాత్రమే లభించింది.

16 రోజులకు ఎంతంటే

హాస్య ప్రధానంగా సాగే ప్రేమకథతో రూపొందిన 'ప్రేమలు' మూవీ భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఫలితంగా 16 రోజుల్లో నైజాం ఏరియాలో రూ. 2.95 కోట్లు షేర్ వసూలు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రూ. 2.41 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. ఇలా ఇప్పటి వరకూ ఈ సినిమా రూ. 5.36 కోట్లు షేర్, రూ. 9.46 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

Premalu Movie 16 Days Telugu Collections Details

ఓవర్సీస్‌లో కలిపి ఇలా
విభిన్నమైన స్టోరీతో తెరకెక్కిన 'ప్రేమలు' సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ ఓవర్సీస్‌లో కూడా గ్రాండ్‌గా విడుదల అయింది. అక్కడ ఈ సినిమా 16 రోజుల్లోనే 300K డాలర్లకు పైగానే రాబట్టింది. అంటే రూ. 1.50 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసింది. వీటితో కలిపితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.86 కోట్లు షేర్‌, రూ. 12.50 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

Premalu Movie 16 Days Telugu Collections Details

టార్గెట్ ఇలా.. లాభమెంత

'ప్రేమలు' మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను ఎస్ఎస్ కార్తికేయ రూ. 1.20 కోట్లకు కొన్నాడు. అంటే.. రూ. 1.50 కోట్లు షేర్ వసూలు చేస్తేనే ఈ చిత్రం హిట్ అవుతుంది. అలాంటిది 16 రోజుల్లోనే 'ప్రేమలు' మూవీ రూ. 6.86 కోట్లు రాబట్టింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 5.36 కోట్లు లాభాలను కూడా అందుకుంది. తద్వారా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X