Premalu 17 Days Collections: ప్రేమలు సంచలన రికార్డు.. 17 రోజుల్లో కోట్ల వర్షం.. కార్తికేయకు జాక్‌పాట్
గతంలో కంటే ఈ మధ్య కాలంలో తెలుగులోకి ఎన్నో రకాల సినిమాలు డబ్బింగ్ అవుతున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే మాతృ భాషలో మాదిరిగా విజయాలను అందుకుంటున్నాయి. అలాంటి చిత్రాల్లో మలయాళంలో సంచలనం సృష్టించిన 'ప్రేమలు' ఒకటి. అక్కడ వంద కోట్ల వసూళ్లతో సత్తా చాటిన ఈ చిత్రం.. తెలుగులోనూ భారీ కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఇలా ఇప్పటికే ఎన్నో రికార్డులను నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో 'ప్రేమలు' మూవీ 17 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందో మీరే చూసేయండి మరి!
ప్రేమలు అంటూ వచ్చారు
నస్లెన్ కే గఫూర్, మమితా బైజు జంటగా గిరీష్ ఏడీ రూపొందించిన ప్రేమకథా చిత్రమే 'ప్రేమలు'. ఈ క్రేజీ మూవీని భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లు నిర్మించారు. ఈ చిత్రంలో అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్‌తో పాటు శ్యామ్ మోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విష్ణు విజయ్ దీనికి మ్యూజిక్ ఇచ్చాడు.

తెలుగు బిజినెస్ ఎంతంటే
మలయాళంలో చరిత్ర సృష్టించిన 'ప్రేమలు' సినిమాను రాజమౌళి కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ తెలుగులో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఈ సినిమా డబ్బింగ్ హక్కులను రూ. 1.20 కోట్లకు సొంతం చేసుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్‌ను మార్చి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేశాడు.
17వ రోజు భారీ వసూళ్లతో
పూర్తి స్థాయి లవ్ అండ్ కామెడీ ఎలిమెంట్స్‌తో రూపొందిన 'ప్రేమలు' చిత్రానికి ఆరంభం నుంచే తెలుగులో మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రం ఇక్కడి మూవీలను వెనక్కి నెట్టేసేలా భారీ వసూళ్లతో సత్తా చాటుతోంది. కానీ, 17వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'ప్రేమలు' హోల్డ్ చేసింది. దీంతో రూ. 25 లక్షలు షేర్, రూ. 45 లక్షలు గ్రాస్ మాత్రమే లభించింది.

17 రోజులకు ఎంతంటే
కామెడీతో పాటు ప్రేమకథతో రూపొందిన 'ప్రేమలు' మూవీ భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఫలితంగా 17 రోజుల్లో నైజాం ఏరియాలో రూ. 3.10 కోట్లు షేర్ వసూలు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రూ. 2.51 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. ఇలా ఇప్పటి వరకూ ఈ సినిమా రూ. 5.61 కోట్లు షేర్, రూ. 10.00 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.
ఓవర్సీస్‌లో కలిపి ఇలా
క్రేజీ సబ్జెక్టుతో రూపొందిన 'ప్రేమలు' సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ ఓవర్సీస్‌లో కూడా గ్రాండ్‌గా విడుదల అయింది. అక్కడ ఈ సినిమా 17 రోజుల్లోనే 300K డాలర్లకు పైగానే రాబట్టింది. అంటే రూ. 1.55 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసింది. వీటితో కలిపితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.16 కోట్లు షేర్, రూ. 13.00 కోట్లు గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.

టార్గెట్ ఇలా.. లాభమెంత
'ప్రేమలు' మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను ఎస్ఎస్ కార్తికేయ రూ. 1.20 కోట్లకు కొన్నాడు. అంటే.. రూ. 1.50 కోట్లు షేర్ వసూలు చేస్తేనే ఈ చిత్రం హిట్ అవుతుంది. అలాంటిది 17 రోజుల్లోనే 'ప్రేమలు' మూవీ రూ. 7.16 కోట్లు రాబట్టింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 5.66 కోట్లు లాభాలను కూడా అందుకుంది. తద్వారా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసేసింది.


Click it and Unblock the Notifications











