Premalu 6 Days Collections: కుమ్మేసిన ప్రేమలు.. 6 రోజుల్లో భారీగా.. రాజమౌళి కొడుక్కి లాభం ఎంతంటే!
ప్యూర్ లవ్ స్టోరీతో వచ్చే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన చేస్తుంటారు. అందుకే ఈ మధ్య కాలంలో భాషతో సంబంధం లేకుండా యూనివర్శల్ లవ్ కాన్సెప్టుతో మూవీలు వస్తున్నాయి. ఇప్పుడు అలా రూపొందిన సినిమానే 'ప్రేమలు'.
మలయాళంలో విడుదలైన ఈ చిత్రం అక్కడ వంద కోట్ల రూపాయలు వసూలు చేసి సత్తా చాటింది. దీంతో రాజమౌళి కుమారుడు కార్తికేయ దీన్ని తెలుగులోకి డబ్బింగ్ చేశాడు. ఇక్కడ కూడా ఈ చిత్రం దూసుకుపోతూనే ఉంది. ఈ నేపథ్యంలో 'ప్రేమలు' మూవీ 6 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే లుక్కేయండి మరి!

ప్రేమలు అంటూ వచ్చారు
నస్లెన్ కే గఫూర్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో గిరీష్ ఏడీ రూపొందించిన సినిమానే 'ప్రేమలు'. ఈ మూవీని మూవీని భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లు నిర్మించారు. విష్ణు విజయ్ దీనికి సంగీతం అందించారు. ఈ చిత్రంలో అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్‌తో పాటు శ్యామ్ మోహన్, తదితరులు కీలక పాత్రల్లో నటించి అలరించారు.
తెలుగు హక్కులు ఎంత?
మలయాళంలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న 'ప్రేమలు' మూవీని చూసి ఫిదా అయిపోయిన ఎస్ఎస్ కార్తికేయ.. ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం తెలుగు అనువాద హక్కులను రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీని మార్చి 8వ తేదీన తెలుగ రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశాడు.

6వ రోజు భారీ వసూళ్లతో
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'ప్రేమలు' చిత్రానికి మొదటి రోజు నుంచే తెలుగులో మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ఐదో రోజు నుంచి ఇది మరింతగా పుంజుకుని 'గామి', 'భీమా' కంటే ఎక్కువ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. ఇలా ఆరో రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'ప్రేమలు' మూవీ సత్తా చాటుతూ రూ. 30 లక్షలు షేర్, రూ. 52 లక్షలు గ్రాస్ అందుకుంది.
ఆరు రోజుల్లో ఎంతంటే
మలయాళంలో మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా 'ప్రేమలు' మూవీ విశేషమైన ప్రేక్షకాదరణను అందుకుంటోంది. ఫలితంగా ఆరు రోజుల్లో నైజాం ఏరియాలో రూ. 95 లక్షలు షేర్ వసూలు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రూ. 65 లక్షలు షేర్ రాబట్టింది. ఇలా ఇప్పటి వరకూ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.60 కోట్లు షేర్, రూ. 3.02 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

టార్గెట్ ఇలా.. లాభమెంత
యూత్‌ఫుల్ కాన్సెప్టుతో రూపొందిన 'ప్రేమలు' మూవీ తెలుగు హక్కులను కార్తికేయ రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేశాడు. అంటే.. రూ. 1.50 కోట్లు షేర్ వసూలు చేస్తేనే ఈ చిత్రం హిట్ అవుతుంది. అలాంటిది ఆరు రోజుల్లోనే 'ప్రేమలు' మూవీ రూ. 1.60 కోట్లు రాబట్టింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 10 లక్షలు లాభాలను కూడా ఈ సినిమా సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











