Premalu 7 Days Collections: ప్రేమలు మూవీకి భారీ వసూళ్లు.. జాక్‌పాట్ కొట్టిన జక్కన్న కొడుకు
ప్రేక్షకుల అభిరుచిలో పూర్తిగా మార్పులు వస్తున్నా.. రొమాంటిక్ లవ్ స్టోరీలతో వచ్చే సినిమాలు మాత్రం మంచి ఆదరణను అందుకుంటున్నాయి. అందుకే ఈ మధ్య కాలంలోనే సౌత్‌లో ఈ తరహా చిత్రాలు ఎక్కువగా రావడంతో పాటు విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇటీవలే అలా వచ్చిన మూవీనే 'ప్రేమలు'. మలయాళంలో చరిత్ర సృష్టించిన ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. దీనికి ఇక్కడ కూడా అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో 'ప్రేమలు' మూవీ 7 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే లుక్కేయండి మరి!
యూత్‌ఫుల్ లవ్ స్టోరీతోనే:నస్లెన్ కే గఫూర్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా గిరీష్ ఏడీ రూపొందించిన సినిమానే 'ప్రేమలు'. ఈ మూవీని మూవీని భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లు నిర్మించారు. విష్ణు విజయ్ దీనికి సంగీతం అందించారు. ఈ చిత్రంలో అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్‌తో పాటు శ్యామ్ మోహన్, తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

తెలుగు హక్కులు ఎంత?:మలయాళంలో అంచనాలు లేకుండానే వచ్చి చరిత్ర సృష్టించిన 'ప్రేమలు' మూవీని చూసి ఫిదా అయిపోయిన ఎస్ఎస్ కార్తికేయ.. ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం తెలుగు అనువాద హక్కులను రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీని మార్చి 8వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు.
7వ రోజు భారీ వసూళ్లతో:యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో రూపొందిన 'ప్రేమలు' చిత్రానికి మొదటి రోజు నుంచే తెలుగులో మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ఐదో రోజు నుంచి ఇది బాగా పుంజుకుని 'గామి', 'భీమా' మూవీల కంటే ఎక్కువ వసూళ్లు తెచ్చుకుంటోంది. ఇలా 7వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'ప్రేమలు' మూవీ హోల్ట్ కనబరుస్తూ రూ. 25 లక్షలు షేర్, రూ. 48 లక్షలు గ్రాస్ అందుకుంది.

ఏడు రోజుల్లో ఎంతంటే:ఎన్నో అంచనాలతో వచ్చి తెలుగు రాష్ట్రాల్లో కూడా 'ప్రేమలు' మూవీ విశేషమైన ప్రేక్షకాదరణను అందుకుంటోంది. ఫలితంగా 7 రోజుల్లో నైజాం ఏరియాలో రూ. 1.10 కోట్లు షేర్ వసూలు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రూ. 75 లక్షలు షేర్ కలెక్ట్ చేసింది. ఇలా ఇప్పటి వరకూ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.85 కోట్లు షేర్, రూ. 3.50 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.
టార్గెట్ ఇలా.. లాభమెంత:యువతను ఆకట్టుకునే కథతో వచ్చిన 'ప్రేమలు' మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను ఎస్ఎస్ కార్తికేయ రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేశాడు. అంటే.. రూ. 1.50 కోట్లు షేర్ వసూలు చేస్తేనే ఈ చిత్రం హిట్ అవుతుంది. అలాంటిది 7 రోజుల్లోనే 'ప్రేమలు' మూవీ రూ. 1.85 కోట్లు రాబట్టింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 35 లక్షలు లాభాలను కూడా ఈ మూవీ ఖాతాలో వేసుకుంది.


Click it and Unblock the Notifications











