Premalu 8 Days Collections: తెలుగులో ప్రేమలు రికార్డు.. రాజమౌళి కొడుకు లక్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే!
యువతను టార్గెట్ చేస్తూ తెరకెక్కించే ప్రేమ కథా చిత్రాలకే ఏ భాషలోనైనా అద్భుతమైన స్పందన వస్తుంటుంది. దీన్ని ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించాయి కూడా. అలా ఇటీవలే మలయాళంలో వచ్చి సంచలన విజాయన్ని సొంతం చేసుకున్న యూత్‌ఫుల్ లవ్ స్టోరీ మూవీనే 'ప్రేమలు'. అక్కడ విజయం సాధించిన ఈ చిత్రాన్ని రాజమౌళి కుమారుడు కార్తికేయ తెలుగులో విడుదల చేశాడు. అతడి నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మరి 'ప్రేమలు' మూవీ 8 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే లుక్కేయండి మరి!
ప్రేమలు అంటూ వచ్చారు
నస్లెన్ కే గఫూర్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో గిరీష్ ఏడీ రూపొందించిన సినిమానే 'ప్రేమలు'. ఈ మూవీని మూవీని భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లు నిర్మించారు. ఈ చిత్రంలో అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్‌తో పాటు శ్యామ్ మోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విష్ణు విజయ్ దీనికి సంగీతం అందించారు.

తెలుగు బిజినెస్ ఎంతంటే
మలయాళంలో వంద కోట్ల రూపాయలకు పైగానే వసూళ్లను రాబట్టిన 'ప్రేమలు' మూవీని చూసి ఫిదా అయిన ఎస్ఎస్ కార్తికేయ.. ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం ఈ మూవీ డబ్బింగ్ హక్కులను రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీని మార్చి 8వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో తీసుకు వచ్చాడు.
8వ రోజు భారీ వసూళ్లతో
యువతను ఆకట్టుకునే నేటి ప్రేమకథతో రూపొందిన 'ప్రేమలు' చిత్రానికి ఆరంభం నుంచే తెలుగులో మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా మూడు రోజుల తర్వాత నుంచి 'గామి', 'భీమా' మూవీలను ఇది దాటేసి వెళ్తోంది. ఇలా 8వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'ప్రేమలు' మూవీ హోల్ట్ కనబరుస్తూ రూ. 35 లక్షలు షేర్, రూ. 65 లక్షలు గ్రాస్ అందుకుంది.

8 రోజులకు ఎంతంటే
భారీ అంచనాలతో వచ్చి తెలుగు రాష్ట్రాల్లో కూడా 'ప్రేమలు' మూవీ భారీ స్థాయిలో స్పందనను అందుకుంటోంది. ఫలితంగా 8 రోజుల్లో నైజాం ఏరియాలో రూ. 1.35 కోట్లు షేర్ వసూలు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రూ. 95 లక్షలు షేర్ కలెక్ట్ చేసింది. ఇలా ఇప్పటి వరకూ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.35 కోట్లు షేర్, రూ. 5 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.
టార్గెట్ ఇలా.. లాభమెంత
'ప్రేమలు' మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను ఎస్ఎస్ కార్తికేయ రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేశాడు. అంటే.. రూ. 1.50 కోట్లు షేర్ వసూలు చేస్తేనే ఈ చిత్రం హిట్ అవుతుంది. అలాంటిది 8 రోజుల్లోనే 'ప్రేమలు' మూవీ రూ. 2.35 కోట్లు రాబట్టింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 85 లక్షలు లాభాలను కూడా అందుకుంది. అలాగే, రూ. 5 కోట్ల గ్రాస్‌తో రికార్డు సాధించింది.


Click it and Unblock the Notifications











