Premalu 9 Days Collections: ప్రేమలు సంచలన వసూళ్లు.. అప్పుడే అన్ని కోట్లా.. నక్కతోక తొక్కిన కార్తికేయ
గతంలో కంటే ఇప్పుడు లవ్ స్టోరీలతో వచ్చే మూవీల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో ఇలాంటి చిత్రాలను ఇష్టపడే వాళ్లు నిరాశ చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో పలు ఇండస్ట్రీల్లో యూత్‌ఫుల్ లవ్ స్టోరీ మూవీలు వస్తున్నాయి.
అలా ఇటీవలే మలయాళంలో వచ్చిన చిత్రమే 'ప్రేమలు'. ఆ భాషలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీని.. రాజమౌళి కుమారుడు కార్తికేయ తెలుగులోకి తీసుకు వచ్చాడు. అతడి నమ్మకాన్ని నిలబెడుతూ ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మరి 'ప్రేమలు' మూవీ 9 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే లుక్కేయండి!

యూత్‌ఫుల్ లవ్ స్టోరీతోనే
గిరీష్ ఏడీ దర్శకత్వంలో నస్లెన్ కే గఫూర్, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమానే 'ప్రేమలు'. ఈ క్రేజీ మూవీని భావన స్టూడియోస్ బ్యానర్‌పై ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్‌లు నిర్మించారు. ఈ చిత్రంలో అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్‌తో పాటు శ్యామ్ మోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విష్ణు విజయ్ దీనికి సంగీతాన్ని సమకూర్చారు.

తెలుగు బిజినెస్ ఎంతంటే
మలయాళంలో 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సత్తా చాటిన 'ప్రేమలు' సినిమాను చూసి ఫిదా అయిన ఎస్ఎస్ కార్తికేయ.. ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేయాలని నిర్ణయించాడు. ఇందుకోసం ఈ సినిమా తెలుగు డబ్బింగ్ హక్కులను రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని మార్చి 8వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశాడు.

9వ రోజు భారీ వసూళ్లతో
యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ప్రేమలు' చిత్రానికి ఆరంభం నుంచే తెలుగులో మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రం కొద్ది రోజులుగా 'గామి', 'భీమా' మూవీలను మించిన రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. ఇలా 9వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'ప్రేమలు' మూవీ హోల్ట్ కనబరుస్తూ రూ. 50 లక్షలు షేర్, రూ. 95 లక్షలు గ్రాస్ అందుకుంది.
9 రోజులకు ఎంతంటే
ఎన్నో అంచనాలతో వచ్చి తెలుగు రాష్ట్రాల్లో కూడా 'ప్రేమలు' మూవీ భారీ స్థాయిలో స్పందనను అందుకుంటోంది. ఫలితంగా 9 రోజుల్లో నైజాం ఏరియాలో రూ. 1.70 కోట్లు షేర్ వసూలు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో రూ. 1.25 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. ఇలా ఇప్పటి వరకూ ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.95 కోట్లు షేర్, రూ. 5.50 కోట్లు గ్రాస్ వసూలు చేసింది.

ఓవర్సీస్‌లో కలిపి ఇలా
యువతను ఆకట్టుకునే ప్రేమకథతో రూపొందిన 'ప్రేమలు' సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ ఓవర్సీస్‌లో కూడా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అక్కడ ఈ సినిమా ఇప్పటికే 200K డాలర్లను వసూలు చేసింది. అంటే రూ. 60 లక్షలు వరకూ షేర్ వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.55 కోట్లు షేర్‌ను కలెక్ట్ చేసింది.

టార్గెట్ ఇలా.. లాభమెంత
'ప్రేమలు' మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్‌ను ఎస్ఎస్ కార్తికేయ రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేశాడు. అంటే.. రూ. 1.50 కోట్లు షేర్ వసూలు చేస్తేనే ఈ చిత్రం హిట్ అవుతుంది. అలాంటిది 9 రోజుల్లోనే 'ప్రేమలు' మూవీ రూ. 3.55 కోట్లు రాబట్టింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 2.05 కోట్లు లాభాలను కూడా అందుకుని సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది.


Click it and Unblock the Notifications











