Premalu Closing Collections: 5 కోట్ల బడ్జెట్.. ప్రేమలు మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?

మలయాళ, తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయం సాధించిన ప్రేమలు చిత్రం థియేట్రికల్ రన్‌ను బాక్సాఫీస్ వద్ద ముగించుకొన్నది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి సుదీర్ఘంగా ప్రదర్శించబడుతూ రికార్డు కలెక్షన్లను సాధించింది. అయితే తొలుత మలయాళ భాషలో, ఆ తర్వాత తెలుగు భాషలో రిలీజై ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురిచేసింది. ప్రముఖ నిర్మాత ఫాహద్ ఫాజిల్ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

యువ దర్శకుడు గిరీష్ ఏడీ దర్వకత్వంలో రూపొందిన ప్రేమలు చిత్రంలో యువ తారలు మమితా బైజు, నస్లేన్, అల్తాఫ్ సలీమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిల భార్గవన్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. భావన స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను సుమారుగా ప్రొడక్షన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి 5 కోట్లతో రూపొందించారు.

Premalu Movie Closing Collections Worldwide Telugu Version gets Record at Box Office

ప్రేమలు చిత్రం తొలుత కేవలం మలయాళం వెర్షన్‌లోనే ప్రదర్శించారు. తొలివారం 12.6 కోట్ల రూపాయలు, రెండోవారం 15 కోట్ల రూపాయలు, మూడో వారంలో 10 కోట్ల రూపాయలు, నాలుగో వారంలో 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఐదో వారం మలయాళంలో 7 కోట్ల రూపాయలతో సుమారుగా 60 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ప్రేమలు సినిమాను ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తీకేయ తొలిసారి నిర్మాతగా,డిస్టిబ్యూటర్‌గా మారి.. ఈ మూవీని రిలీజ్ చేశారు. రాజమౌళి కూడా ప్రమోషన్ చేయడంతో భారీగా క్రేజ్ సంపాదించకొన్నది. ఇక ఈ సినిమాకు తెలుగులో భారీ స్పందన తొలి రోజు నుంచే లభించింది.

Premalu Movie Closing Collections Worldwide Telugu Version gets Record at Box Office

ఇక తెలుగు వెర్షన్‌లో రిలీజైన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను సుమారుగా 2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసి డబ్బింగ్ చిత్రంగా రిలీజ్ చేశారు. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో సుమారుగా 14 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆంధ్రా, నైజాంలో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమాకు ఓవర్సీస్‌లో అన్ని వర్గాల ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి సుమారుగా 40 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఓ మలయాళ చిత్రం నార్త్ అమెరికాలో అత్యధికంగా వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. దాంతో ఈ సినిమా 100 కోట్ల షేర్.. 114 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X